బాపట్ల జిల్లాలో వైసీపీకి భారీ షాక్- ఆ కీలక నేత రాజీనామా..!

సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోని బాపట్ల జిల్లాలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో ఇప్పటివరకూ కీలక నేతగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీని వీడారు. ఈ నెల 9న తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు.

amanchi krishna mohan resigned to ysrcp may join opposition soon

బాపట్ల జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఆమంచి ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. అయితే చీరాల నియోజకవర్గం నుంచి ఆయన సీటు ఆశించారు. కానీ జగన్ మాత్రం కరణం వెంకటేష్ కు టికెట్ కేటాయింంచారు. దీంతో కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న ఆమంచి.. ఇవాళ వైసీపీకి రాజీనామా చేేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీకి కీలక సమయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

మరోవైపు ఈ నెల 9న అనుచరులతో ఆమంచి కృష్ణమోహన్ భేటీ ఏర్పాటు చేశారు. ఇందులో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆమంచి వెల్లడించారు. దీంతో ఆయన టీడీపీ లేదా జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాపట్ల జిల్లాలో ఇప్పటికే వైైసీపీకి గడ్డు పరిస్ధితలు ఎదురవుతున్నాయన్న అంచనాల నేపథ్యంలో ఆమంచి కూడా విపక్షంతో చేరితే మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+