అమరరాజా తరలింపు దుమారం : గల్లా ప్లాన్ తో మైండ్ బ్లాంక్, ఉపాధికి లింక్ పెట్టి జగన్ సర్కార్ పై టీడీపీ ఒత్తిడి !!
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలేదని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అనేకమార్లు ఆరోపణలు చేసింది. జగన్ రెడ్డి జే ట్యాక్స్ కు భయపడి రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని గత కొంతకాలంగా టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వివిధ ఫ్యాక్టరీలు కూడా దుకాణం ఎత్తేస్తున్నాయని, పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయని, దాని వల్ల రాష్ట్రంలో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అమరరాజా బ్యాటరీ కంపెనీ వ్యవహారంతో ఆందోళన బాట పట్టారు.

అమరరాజాకు నోటీసులతో మొదలైన రగడ .. కోర్టులో ఊరట, అయినా తరలింపు నిర్ణయం
ఇక అసలు విషయానికి వస్తే అమర రాజా బ్యాటరీలకంపెనీ బ్యాటరీల నుండి వచ్చే లెడ్వల్ల తీవ్రమైన జల కాలుష్యం జరుగుతోందని పేర్కొన్న కాలుష్య నియంత్రణ బోర్డు నోటీసు జారీ చేసి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు షాక్ ఇచ్చింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించినచిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం,తిరుపతి కరకంబాడి యూనిట్లను మూసివేయాలనిపొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వెంటనే విద్యుత్ ను కూడా కట్ చేసి ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేసింది. దీనిపై కోర్టుకు వెళ్లిన గల్లా జయదేవ్ కు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసి గల్లా జయదేవ్ ఫ్యాక్టరీకి విద్యుత్ ను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ తీరుతో అమర రాజా యజమాన్యం తమ ఫ్యాక్టరీని ఇతర రాష్ట్రాలకు తరలించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో తమిళనాడు రెడ్ కార్పెట్ పరిచి మరీ అమర రాజాను తమ రాష్ట్రానికి ఆహ్వానించింది.అన్ని వసతులు కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చింది.

అమరారాజాపై వైసీపీ నేతల అభిప్రాయం ఇదే
ఇక దీంతో మొదలైన దుమారం నేటికీ కొనసాగుతోంది. అమర రాజా వ్యవహారం పై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి మొదట అమర రాజా ను తామే పొమ్మన్నామని చెప్పి, మళ్లీ మాట మార్చి అమర రాజా బ్యాటరీస్ సంస్థను తాము పొమ్మనడం లేదని కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తూ తిరిగి అనుమతి తీసుకొని నడుపుకోవచ్చని వ్యాఖ్యలు చేశారు. ఇక అమర రాజా వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాభాల కోసమే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలని ఆ కంపెనీ భావిస్తోందని రీ లొకేట్ చెయ్యాలంటే చిత్తూరులోనే మరో ఐదు వేల ఎకరాల స్థలం ఉందని స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ తో పొలిటికల్ గా ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అమరరాజా ఏపీ వదిలి వెళ్లాలని కోరుకోవడం లేదంటూ పేర్కొన్నారు.

టీడీపీ ఎంపీకి షాక్ ఇవ్వాలనుకున్న సర్కార్ .. రివర్స్ షాక్ ఇచ్చిన అమరరాజా
వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అమర రాజా పై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఫలితంగా రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక టీడీపీ సైతం ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ ను టార్గెట్ చేస్తుంది. టిడిపి నేత కు సంబంధించిన అమర రాజా సంస్థను ఇబ్బంది పెట్టి టీడీపీకి షాక్ ఇవ్వాలనుకుంటే, తమిళనాడుకు తరలింపు నిర్ణయం తీసుకొని అమర రాజా బ్యాటరీస్ ఏపీ ప్రభుత్వానికి రివర్స్ షాక్ ఇచ్చింది.

చిత్తూరు జిల్లాలో అమరరాజా తరలింపుపై దుమారం
ఇదిలా ఉంటే అమర రాజా ఫ్యాక్టరీని తమిళనాడు తరలిస్తే ఉపాధి కరువు అవుతుందని చిత్తూరు జిల్లాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమర రాజా పై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని మండిపడుతున్నారు. కావాలని కక్షసాధింపు చర్యల్లో భాగంగా అమర రాజాను ఇబ్బంది పెడుతున్నారని టిడిపి అగ్ర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థను కాపాడాలని ఆందోళన
దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ సంస్థ అయిన అమర రాజా 35 వేల మందికి ఉపాధి కల్పిస్తోందని , ఇప్పుడు ఈ సంస్థ తమిళనాడుకు తరలిపోతే వారంతా రోడ్డున పడతారని విమర్శిస్తున్నారు. అమరరాజా సంస్థ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, పన్నుల రూపంలో ఈ సంస్థ ఏపీ ప్రభుత్వానికి చెల్లిస్తుందని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో నూతన పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవరూ ముందుకు రాకపోగా, ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతే ప్రజల జీవనోపాధి ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అమర రాజా ఫ్యాక్టరీ ని తరలించవద్దని, ఎలాగైనా తరలింపును నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్న టిడిపి నేతలు నిన్న చిత్తూరు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.

అమరరాజా తరలిపోతే ఉపాధి పోగొట్టిన సర్కార్ గా మిగిపోతారని ధ్వజం
ప్రభుత్వం చొరవ తీసుకుని అమర రాజా బ్యాటరీస్ ఫ్యాక్టరీ తరలింపు ఆపాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వివిధ దేశాల నుంచి కంపెనీలు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు పడితే, వైసీపీ ప్రభుత్వ తీరుతో ఇక్కడ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న అమర రాజాను తరలిపోకుండా ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని పరిశ్రమలపై కక్ష సాధింపు చర్యలతో ప్రజలకు నష్టం చేస్తుందని, ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్న అమరరాజా వ్యవహారంలో ముందు ముందు ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications