అమరావతి వ్యవహారం : సుప్రీంకోర్టులోకి బంతి నెట్టేసిన కేంద్రం - ఆ రిపోర్ట్ చుట్టూ జగన్ సర్కార్

ఏపీలో రాజధాని వ్యవహారంపై కేంద్రం తన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పేసింది. అంతే కాదు సుప్రీం ఇచ్చే తీర్పుకు కట్టుబడి ఉండేందుకు సిద్ధమవుతోంది. దీంతో వైసీపీ శివరామకృష్ణన్ రిపోర్ట్ ను తెరపై తెచ్చి కౌంటర్ చేస్తోంది.

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంపై ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ వాయిదాలతో సాగుతుండగా.. మరోవైపు కేంద్రం తాజాగా పార్లమెంటులో అమరావతి రాజధానిపై తన అభిప్రాయం చెప్పడంతో పాటు అదే వాదనతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీంతో కేంద్రం అఫిడవిట్ కు కౌంటర్ గా ఏపీ సర్కార్ గతంలో వికేంద్రీకరణకు మద్దతుగా శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ను తెరపైకి తెస్తోంది. తాజాగా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ వెనుక కూడా వైసీపీ సర్కార్ ఉందన్న వాదన వినిపిస్తోంది.

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ల రచ్చ

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ల రచ్చ

గతంలో ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న అంశాల ఆధారంగానే అమరావతి రాజధాని ఏర్పాటు అయిందంటూ తాజాగా పార్లమెంటులో, సుప్రీంకోర్టులో కేంద్రం వినిపించిన వాదన ఏపీలో రాజకీయంగా చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా కేంద్రం వాదనతో వైసీపీ ఇరుకునపడినట్లు భావిస్తుండగా.. తాము చెప్పిన విషయాల్నే కేంద్రం అఫిడవిట్ లో చెప్పిందంటూ నిన్న వైసీపీ నేత సజ్జల మీడియా ముందుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం అసలు చెప్పిందేంటి , పార్టీలు చెబుతున్నదేంటి అన్న చర్చ మొదలైంది.

కేంద్రం చెప్పింది ఇదే..

కేంద్రం చెప్పింది ఇదే..

అమరావతి రాజధానికి సంబంధించి పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన సమాధానం, అలాగే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ఇందులో కేంద్రం అమరావతి రాజధాని ఏర్పాటు ఎలా జరిగిందన్న దానిపై తమ వాదన వినిపించింది. ఇందులో కేంద్రం అమరావతి రాజధాని ఏర్పాటుకు కారణమైన విభజన చట్టం సెక్షన్లను ప్రస్తావిస్తూనే, ప్రస్తుతానికి దీని ఆధారంగా చూస్తే అమరావతే రాజధాని అని పేర్కొంది. అలాగే మూడు రాజధానుల బిల్లుల్ని తమకు చెప్పకుండానే వైసీపీ సర్కార్ తెచ్చిందని, ఉపసంహరించుకుందని కూడా వెల్లడించింది. ఇందులో ఎలాంటి వివాదం లేదు. అయితే తాము నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక అప్పటి చంద్రబాబు సర్కార్ కు పంపామని, ఆ తర్వాతే ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చెబుతోంది. దీని ఆధారంగానే తాము రూ.2500 కోట్ల నిధులు రాజధానికి ఇచ్చినట్లు చెబుతోంది.

సుప్రీంకోర్టులోకి బంతి నెట్టేసిన కేంద్రం ?

సుప్రీంకోర్టులోకి బంతి నెట్టేసిన కేంద్రం ?

అమరావతి రాజధాని విషయంలో కేంద్రం చేస్తున్న వాదన చూస్తుంటే దీనిపై తాము ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే తమకు శిరోధార్యమని చెప్పేసినట్లయింది. అందుకే సుప్రీంకోర్టులో ఉన్న కేసులో తాము జోక్యం చేసుకోవడం లేదని, ప్రస్తుతానికి అమరావతి రాజధాని అని మాత్రమే చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే మూడు రాజధానుల వ్యవహారంలోనూ జరిగింది జరిగినట్లుగానే వివరణలోనూ, అఫిడవిట్లోనూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఏపీ సర్కార్ అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తెచ్చిన సందర్భంలోనూ

కేంద్రం వాటిని సమర్ధించడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయలేదు. గతంలో హైకోర్టులో మాత్రం రాజధాని ఎంపిక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అందుకే అమరావతిని ఎంచుకున్నప్పుడు అభ్యంతరం చెప్పలేదని తెలిపింది. ఇప్పుడు కూడా దాదాపు అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పేసింది. తద్వారా సుప్రీంకోర్టులోకి బంతి నెట్టేసింది.

ఆ రిపోర్ట్ చుట్టూ జగన్ సర్కార్ ?

ఆ రిపోర్ట్ చుట్టూ జగన్ సర్కార్ ?

అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇరుకునపడ్డ జగన్ సర్కార్ ఒక రోజు విరామం తర్వాత దీనిపై స్పందించింది. కేంద్రం ఇప్పుడు చెప్పిందే తాము ఎప్పటినుంచో చెబుతున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వెల్లడించారు. అంతే కాదు శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా చంద్రబాబు ప్రభుత్వం రాజధానిపై నిర్ణయం తీసుకోలేదన్నదే తమ అభ్యంతరమనీ చెప్పుకొచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టులోనూ అదే వాదనతో ముందుకెళ్లేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమవుతోంది. అలాగే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాలని సుప్రీంకోర్టులో తాజాగా దాఖలైన పిటిషన్ వెనుక కూడా జగన్ సర్కారే ఉందన్న వాదన వినిపిస్తోంది. ఇలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాదనలు చేసుకుంటున్నా అంతిమంగా సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్ కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+