అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొలికి: గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు మేరకే అమరావతి నిర్మాణాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణాలు తమ తుది తీర్పుకు లోబడి ఉండాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై శ్రీమన్నారాయణ, మాజీ ఐఎఎస్ ఈఏఏస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై ట్రిబ్యునల్ శుక్రవారం విచారణ జరిపింది.

ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ట్రిబ్యునల్ ముందు ఏపీ తరపున్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. ప్రస్తుతం రెండు లంక గ్రామాల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు.

Amaravati construction should follow Green tribunal judgement

కాగా పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది సంజయ్ పారీఖ్ వాదిస్తూ రాజధాని ప్రాంతంలో వేగంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారని, ఆ ప్రాంతంలో ప్రవహించే కొండవీటి వాగు ప్రవాహగతిని మారుస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై అన్ని వివరాలతో వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ తరపున్యాయవాదికి సూచించింది.

మరో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిర్మాణాలలో పదేపదే పర్యావరణ అనుమతుల ఉల్లంఘన జరుగుతున్నందున ఏన్జీటి పర్యవేక్షణలో స్వతంత్ర నిపుణుల కమిటీ వేయాలని సంజయ్ పారిఖ్ విజ్ఞప్తి చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో నిర్మాణాలన్నీ ఏన్జీటి తుది తీర్పునకు లోబడి ఉండాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 31 తేదీకి వాయిదా వేసింది.

English summary
Green tribunal clarified that Amaravati constructions sholu follow its final judgement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X