అమరావతిలో ప్లాట్లు, వాస్తు: రైతుల అసంతృప్తి, బాబుకు కొత్త చిక్కు

నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులకు ఓ భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయనే విషయం తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు.

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రైతులకు ఓ భయం పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయనే విషయం తెలియక ప్రజలు ఎదురు చూస్తున్నారు.

రాజధాని రైతులకు కొత్త సమస్య

రాజధాని రైతులకు కొత్త సమస్య

ఇప్పుడు తమకు మరో చిక్కు వచ్చి పడిందని పలువురు రైతులు వాపోతున్నారని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజధాని రైతులకు కొత్త సమస్య ఎదురైంది. ప్రభుత్వం తమకు ఇచ్చిన ప్లాట్లకు వాస్తు దోషం ఉన్నట్లు కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ చేసే సమయంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recommended Video

    World Bank shock to Chandrababu అమరావతికి రుణంపై ప్రపంచ బ్యాంక్ డైలమా? | Oneindia Telugu
    రాజధాని ఎంపికలోను వాస్తు

    రాజధాని ఎంపికలోను వాస్తు

    క్షేత్రస్థాయిలో ప్లాట్లను చూపించకుండా రిజిస్టేషన్లు చేసుకోవాలని చెప్పడం, వాస్తు దోషం ఉన్న ప్లాట్లను కేటాయించడం వారిని అసహనానికి గురి చేసిందని తెలుస్తోంది. ఇల్లు కట్టాలన్న, ప్లాట్లు కొనుగోలు చేయాలన్న చాలామంది వాస్తు చూస్తారు. రాజధాని ఎంపికలో కూడా ప్రభుత్వం వాస్తును పాటించింది.

    అలా ఒప్పందం కుదుర్చుకున్నారు

    అలా ఒప్పందం కుదుర్చుకున్నారు

    నదీతీరం, ఎదురుగా కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రీ, సారవంతమైన నల్లరేగడి భూములు, మరోవైపు పుష్కలంగా జలం ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ప్రభుత్వం ఎంపిక చేసింది. భూసమీకరణలో భూములను సీఆర్డీఏకు ఇచ్చిన రైతులు తమకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

    ఇదీ రైతుల ఆందోళన

    ఇదీ రైతుల ఆందోళన

    సీఆర్డీఏ లెక్కల ప్రకారం 22,525 మందికి రైతులకు 56,971 ప్లాట్లను ఇవ్వాల్సి ఉంది. ఈ ప్లాట్లన్నింటికీ రోడ్డు, అండర్ గ్రౌండ్, డ్రెయినేజీ, కేబుల్స్, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించి అప్పగిస్తామని చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. వాస్తు కావాలని రైతులు అడిగారు. దానికీ అంగీకరించింది. కానీ తాజా లేఅవుట్లలో దక్షిణ ముఖం ఉన్న ప్లాట్లు ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+