అమరావతి టూ అరసవల్లి రాజధాని రైతుల మహా పాదయాత్రకు షెడ్యూల్ ఫిక్స్; ముహూర్తం ఎప్పుడంటే!!

అమరావతి రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో అమరావతి ప్రాంత రైతులు ఉత్సాహంగా మహా పాదయాత్ర నిర్వహించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన అమరావతి ప్రాంత రైతులు రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని ఈసారి అమరావతి నుండి అరసవల్లి వరకు పాదయాత్ర చేయనున్నారు.

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..వెంకట పాలెం నుండి ప్రారంభం

అమరావతి రైతుల మహా పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్..వెంకట పాలెం నుండి ప్రారంభం

అమరావతి ఉద్యమం ప్రారంభమై 1000 రోజులు అవుతున్న సందర్భంగా ఈనెల 12వ తేదీ నుండి అమరావతి నుండి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన రైతులు ఎట్టకేలకు హైకోర్టు అనుమతితో పాదయాత్ర కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 12 వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు పాదయాత్ర ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. వెంకట పాలెం లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఆపై ప్రత్యేకంగా సిద్ధం చేసిన శ్రీవారి రథాన్ని వెంకట పాలెం గ్రామానికి తీసుకు వస్తారు. 9 గంటలకు ప్రధానికి జెండా ఊపి లాంఛనంగా అమరావతి పాదయాత్రను ప్రారంభిస్తారు.

రైతుల పాదయాత్రకు వైసీపీ తప్ప ప్రతిపక్ష పార్టీల మద్దతు

రైతుల పాదయాత్రకు వైసీపీ తప్ప ప్రతిపక్ష పార్టీల మద్దతు

అమరావతి ప్రాంత రైతులు ప్రారంభిస్తున్న ఈ దఫా పాదయాత్రకు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పా మిగతా అన్ని పార్టీలను ఆహ్వానించిన అమరావతి పరిరక్షణ సమితి ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ఎంతగానో ప్రయత్నం చేస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని రైతు జేఏసీ సమన్వయ కమిటీ సభ్యులు అమరావతి పాదయాత్ర కోసం సిద్ధమవుతున్నారు.

తొలిరోజు పాదయాత్ర షెడ్యూల్ ఇదే

తొలిరోజు పాదయాత్ర షెడ్యూల్ ఇదే

ఇక అమరావతి మహాపాదయాత్ర విషయానికి వస్తే యాత్ర తొలిరోజు వెంకట పాలెం నుండి కృష్ణాయ పాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరి కి చేరుకుంటుంది. తొలి రోజు మంగళగిరి లోనే రాత్రి బస చేస్తారు. ఇక షరతులతో కూడిన పాదయాత్రను నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి నేతలు పాదయాత్రలో పాల్గొన్న వారి వివరాలను డీజీపీ కార్యాలయంలో అందజేశారు.

2019 డిసెంబర్ నుండి కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

2019 డిసెంబర్ నుండి కొనసాగుతున్న అమరావతి ఉద్యమం

2019 డిసెంబర్‌లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిలో శాసనసభ రాజధానితో సహా రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించి ఆమోదించింది. అప్పటి నుంచి అమరావతి ప్రాంత రైతులు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో నిరసనలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి కొనసాగుతున్న అమరావతి ఉద్యమం వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మరో మహా పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని భావించారు అమరావతి ప్రాంత రైతులు.

పాదయాత్రలో 600 మందికి అనుమతి... షరతులు ఇవే

పాదయాత్రలో 600 మందికి అనుమతి... షరతులు ఇవే

సెప్టెంబరు 12 నుంచి 'మహా పాదయాత్ర' చేపట్టేందుకు అమరావతి పరిరక్షణ సమితి కొన్ని షరతులతో అనుమతించాలంటూ చేసిన విజ్ఞప్తిని సమీక్షించాలని ఏపీ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇక ఇదే సమయంలో సెప్టెంబర్ 12న అమరావతిలో ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగిసే యాత్రలో 600 మంది పాల్గొనవచ్చని కోర్టు ఆదేశించింది. పాల్గొనే వారందరూ ఐడి కార్డు ధరించి, తుది సమావేశానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని కూడా కోర్టు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+