జగన్ అలా చేయడంతో.. నిరాశ చెందిన రైతులు: వాహనం కూడా ఆపకుండా!..
ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ తీరు పట్ల రాజధాని రైతులు కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. నేటి ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో..
విజయవాడ: ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ తీరు పట్ల రాజధాని రైతులు కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. నేటి ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. రాజధాని కోసం స్వచ్చందంగా భూములు ఇచ్చిన రైతులంతా నేతల కోసం విందు ఏర్పాటు చేశారు.
రైతులు ఏర్పాటు చేసిన ఈ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం ఈ విందుకు హాజరుకాలేదు.

విందు సమయంలో జగన్ అటువైపు నుంచి వెళ్తున్నప్పుడు రైతులు ఆయన్ను పిలిచారు. అయితే వాహనం ఆపకుండా జగన్ అక్కడినుంచి వెళ్లిపోవడంతో రైతులు నిరాశకు లోనైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications