అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పృధ్వీ పై అమరావతి మహిళల ఆగ్రహం:ఫ్లెక్సీని చెప్పులతో కొడుతూ: వ్యాఖ్యలకు నిరసనగా..!

|
Google Oneindia TeluguNews

ఎస్వీబీసీ ఛైర్మన్..సినీ ప్రముఖుడు పృధ్వీ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిరసనల పైన చేసిన వ్యాఖ్యల పట్ల ఆ ప్రాంత రైతులు తీవ్రంగా స్పందించారు. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులు ఆందోళన చేస్తున్నారని.. రైతులు బురదలోనే ఉండాలి...దొరికింది తినాలి అంటూ వ్యాఖ్యానించారని రైతులు మండిపడుతున్నారు. దీని పైన అమరావతి ప్రాంతంలోని రైతులు మహిళలు తీవ్రంగా స్పందించారు. పృధ్వీ ఫెక్ల్సీ ని చెప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేసారు.

అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!అమరావతి రైతులకు అండగా బాలకృష్ణ: పండుగకు చంద్రబాబు దూరం: పోరాటానికి మద్దతుగా..!

తాము అందరం ప్రతీ రోజు ఆధార్ కార్డులు పట్టుకొని నిరసనల్లో కూర్చుంటున్నామని..పృధ్వీ తమ వద్దకు వస్తే సమాధానం చెబుతామన్నారు. రైతులు బురద లోనే ఉండాలని పృధ్వీ చేసిన వ్యాఖ్యలను వారు తప్పు బట్టారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని..రాజధానిని ఇప్పుడు ఇక్కడ కాదని తరలిస్తుంటే రోడ్ల మీదకు వచ్చామని వివరించారు. ఎక్కడో కూర్చొని తమ మీద వ్యాఖ్యలు చేయటం కాదని..తమ ముందుకు వచ్చి తమ ఆందోళనల గురించి మాట్లాడాలని ఫైర్ అయ్యారు.

Amaravati ladies serious on SVBC Chairman Prudhviraj

రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ సినీనటుడు పృథ్వీరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై రాజధాని రైతులు భగ్గుమన్నారు. పృథ్వీరాజ్ దిష్టబొమ్మను చెప్పులతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రైతులను కించపరిచిన పృథ్వీరాజ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మందడంలో పృథ్వీరాజ్‌ దిష్టిబొమ్మ దహనానికి రైతులు యత్నించగా, వారి పోలీసులు అడ్డుకున్నారు.

మహిళా రైతులు పృధ్వీ రాజ్ తో పాటుగా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యల మీద మండిపడ్డారు. మహిళలే రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారని పద్మ వ్యాఖ్యానించారు. దీని పైన రైతులు స్పందిస్తూ..మరి వాసిరెడ్డి పద్మ మహిళగా ఎందుకు బయటకు వస్తున్నారని..అమె మహిళల తరపున నిలబడాలని డిమాండ్ చేసారు.

English summary
Amaravati Farmers seriously responded on SVBC chairman and Cine artist prudhvi Raj on thier agitation. amaravati local people beaten Prudhvi flexi with slippers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X