జనవరి 7న అమరావతి మారథాన్‌...నమోదు ఇలా...సిపి గౌతమ్ సవాంగ్ వెల్లడి...

అమరావతి: ఈ నెల 7న విజయవాడలో అమరావతి మారథాన్‌ నిర్వహిస్తున్నట్టు సిపి గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అందరి ఐక్యత చాటే విధంగా ఈ మారథాన్ ను నిర్వహిస్తున్నట్లు గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.

అమరావతి మారథాన్ ను పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన అమరావతి మారథాన్‌ టీషర్ట్‌ ను గౌతమ్‌ సవాంగ్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దీప్‌ ట్రస్ట్‌ సహకారంతో హాల్ఫ్‌ మారథాన్‌, 10 కె పరుగు, 5కె ఫన్‌ రేస్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు.

Amaravati marathon on January 7

సిఎం చే ప్రారంభం...
ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 7 వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ మారథాన్ ప్రారంభవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మారథాన్ ను ప్రారంభిస్తారని సిపి గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు.

నమోదు ఇలా...

మారథాన్‌ లో పాల్గనే వారు తమ పేర్లను ఆన్‌ లైన్‌ లో www.amaravatimarathon.run లో నమోదు చేసుకోవాలి.
ఈ కార్యక్రమాన్నికి 7 వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+