అలా అయితే సీమకు అన్యాయం: టిజి, 'ఒక పెళ్లికి రెండు సార్లు బాబు'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు టిజి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే రాయలసీమవాళ్లకు, ఉత్తరాంధ్రవాళ్లకు భవిష్యత్తులో అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ గురువారం విశాఖపట్నంలో తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుంటే చంద్రబాబు పర్యటించడం మానేసి ఓ పెళ్లికి రెండు సార్లు హాజరు కావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరువు నెలకొనడంతో బెంగళూరుకు, కేరళకు రైతులు వలసలు పోతున్నారని, దానిపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇసుక మాఫియాపై తన మంత్రివర్గంలోని మంత్రులు, పార్లమెంటు సభ్యులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
నిత్యావసర సరుకుల ధరల ఆకాశాన్ని అంటాయని, దీనిపై ఈ నెల 9వ తేదీన అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications