ప్రభుత్వంతో విభేదించినా..: టైమ్ క్యాప్సూల్లో ప్రజాభిప్రాయం, 'మై బ్రిక్..'కు స్పందన
అమరావతి: దసరా పర్వదినం నాడు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో ఉద్దండరాయునిపాలెంలో పెద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు. అందులో టైమ్ క్యాప్యూల్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రజలు తమ తమ ఆలోచనలను రాసి టైమ్ క్యాప్యూల్‌లో పెట్టవచ్చు.
ఇంతకుముందు విభజన, చట్టసభల్లో చర్చలు తదితర ఏ అంశాన్నైనా రాసి టైమ్ క్యాప్యూల్‌లో పెట్టవచ్చని ప్రభుత్వం సూచించింది. అయితే, దానిని ఇప్పుడు కేవలం రాజధాని నిర్మాణానికే పరిమితం చేసింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గురువారం చెప్పారు.
ప్రజలు కాగితాల పైన తమ ఆలోచనను పెట్టి.. ఆ సంకల్ప పత్రాలను టైమ్ క్యాప్యూల్లో పెట్టవచ్చునని చెప్పారు. రాజధాని నిర్మాణం గురించి మాత్రమే సంకల్ప పత్రాల్లో రాయాలని సూచించారు. ప్రజలు ప్రభుత్వం రాజధాని నిర్మాణం ప్రణాళికను ఆమోదించవచ్చు లేదా వ్యతిరేకించవచ్చు.
ఎవరైనా సంకల్ప పత్రాలను (రాసి పెట్టడం) టైమ్ క్యాప్యూల్లో పెట్టవచ్చునని చెబుతున్నారు. తద్వారా ఇది కేవలం కాగితాలు ఉంటే డబ్బాగా కాకుండా... ప్రజల అభిప్రాయాన్ని, ఆలోచనని భవిష్యత్తు తరాలకు సూచించేదిగా ఉంటుంది. మరోవైపు, మై బ్రిక్ మై అమరావతికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి.

చంద్రబాబు మహా కలశ పోస్టర్ విడుదల
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మై బ్రిక్ మై అమరావతి పేరుతో గురువారం వెబ్ సైట్ ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి సహకరించే వారు ఈ సైట్ ద్వారా ఇటుకలను కొనవచ్చు. ఒక్కో ఇటుక ధరను రూ.10గా నిర్ణయించారు.

చంద్రబాబు మహా కలశ పోస్టర్ విడుదల
చంద్రబాబు దీనిని ప్రారంభించిన కొద్ది గంటల్లోనే విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు నాలుగు లక్షలకు పైగా ఇటుకలు వచ్చాయి. మై బ్రిక్ మై అమరావతికి అనూహ్య స్పందన వస్తోందని చెబుతున్నారు.

చంద్రబాబు మహా కలశ పోస్టర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు మహాకలశ యాత్ర పోస్టర్‌ను ప్రారంభించారు.

చంద్రబాబు మహా కలశ పోస్టర్ విడుదల
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు తంజావూరు టూ అమరావతి మహాకలశ యాత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ మహాకలశ యాత్రను టిడిపి తమిళనాడు విభాగం చేపడుతోంది.












Click it and Unblock the Notifications