అమరావతి తప్ప దేన్ని ఒప్పుకోం.... ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అత్యవసర సమావేశం

ఏపీ రాజధానిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రకటనపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. దీంతో రాజధాని ప్రాంతంగా అమరావతి ఉండాలనేదే టీడీపీ విధానమని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీలో మూడు రాజధానులకు రావచ్చంటూ... అధికార వైసీపీ చేసిన ప్రకటనపై టీడీపీ భగ్గుమంది. అసెంబ్లీలో సీఎం రాజధానిపై ప్రకటన చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ ప్రకటనపై చర్చించారు. అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. కాగా ప్రాంతీయ విద్యేషాలు రెచ్చగొట్టేందుకే సీఎం జగన్ మూడు రాజధానులంటూ గందరగోళ ప్రకటనలు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రకటన మైండ్ గేమ్‌లో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

Amaravati to be the only capital of ap

అమరావతిపై తనకున్న పగను తీర్చుకుంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. ఉద్దేశ్వపూర్వకంగానే రాజధానిపై సీఎం గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు. కాగా టీడీపీ హయాంలోనే 13 జిల్లాల అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా అభివృద్దికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ అలా ఎందుకు మాట్లాడారో తానే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+