అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అమరావతి ప్రయాణానికి 1080 రోజులు, మరో నయారాయపూర్ కానివ్వం'

|
Google Oneindia TeluguNews

Recommended Video

బాబుకు రాజమౌళి థ్యాంక్స్ : టవర్‌ ఆకృతి కి ఎక్కువ వోట్లు !

అమరావతి: రాజధాని అమరావతిని హరిత, నీలి నగరంగా నిర్మిస్తున్నట్లు సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ గురువారం తెలిపారు. అమరావతి నిర్మాణంపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలకు ఆయన హాజరయ్యారు.

ఈ కార్యశాలలో హ్యాపీ సిటీ విజన్‌, ప్రభుత్వ భవన సముదాయాలు, మౌలిక సదుపాయాలు, రవాణా, అర్థిక కేంద్రంగా అమరావతి వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడారు.

అమరావతి ప్రయాణానికి 1080 రోజులు

అమరావతి ప్రయాణానికి 1080 రోజులు

అమరావతి ప్రయాణం నేటితో 1,080 రోజులకు చేరిందని తెలిపారు. 35 నెలల్లో 50 శాతం నిర్మాణ లక్ష్యాలను చేరుకున్నామని చెప్పారు. డిజైన్లలో చూపినట్లు అమరావతి కనిపించడానికి ఇంకెంతో కాలం పట్టదని చెప్పారు.

దేశానికే బ్రాండ్ నగరంగా

దేశానికే బ్రాండ్ నగరంగా

ప్రతిక్షణం, ప్రతిరోజూ రూపును మార్చుకుంటూ అద్భుత నగరం నిర్మితమవుతోందని, అమరావతిని రాష్ట్రానికే కాదు దేశానికే బ్రాండ్‌ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని శ్రీధర్ తెలిపారు.

ముంబై, ఢిల్లీ, బెంగళూరులతో పోటీపడుతూ

ముంబై, ఢిల్లీ, బెంగళూరులతో పోటీపడుతూ

ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి వాటితో పోటీపడుతూ ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నామని, అమరావతిలో ఇప్పటికే రూ.20వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, ఐకానిక్‌ భవనాలు నిర్మించాలన్నది తమ కల అని శ్రీధర్ అన్నారు.

జగన్‌ను అంటే చంపేస్తాం, పిల్లోడివి: పవన్‌కు అభిమాని హెచ్చరిక, హైపర్ ఆదితో పోలికజగన్‌ను అంటే చంపేస్తాం, పిల్లోడివి: పవన్‌కు అభిమాని హెచ్చరిక, హైపర్ ఆదితో పోలిక

అమరావతిని మరో నయా రాయపూర్ చేయదల్చుకోలేదు

అమరావతిని మరో నయా రాయపూర్ చేయదల్చుకోలేదు

నార్మన్‌ ఫోస్టర్‌ లాంటి ప్రముఖ ఆర్కిటెక్ట్‌తో భవనాల ప్రణాళిక చేయించామని, అద్భుతమైన భవనాలుంటేనే ప్రజలు వాటిని చూడటానికి వస్తారని, ఒక్కరోజులో ఏ నగరమూ నిర్మాణం కాలేదని, అమరావతిని మరో నయా రాయ్‌పూర్‌ చేయదల్చుకోలేదన్నారు. అందుకే ప్రణాళికకు, నిర్మాణానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నామని, అమరావతిని ఆనందమయ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని శ్రీధర్ తెలిపారు.

పరిటాల కుటుంబంపై జగన్-ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు, బాధపడ్డ సునీత, రెచ్చగొట్టొద్దంటూపరిటాల కుటుంబంపై జగన్-ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు, బాధపడ్డ సునీత, రెచ్చగొట్టొద్దంటూ

English summary
Amaravati will not become nia raipur, says CRDA commissionor Sridhar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X