ఏపీ నుండి అయోధ్య రామయ్యకు కిలో బంగారం, 13కిలోల వెండితో అపురూప బహుమతి

అయోధ్యలో బాల రామాలయ ఏర్పాటుతో దేశం మొత్తం భక్తి పారవశ్యంలో ఓలలాడిన విషయం దేశంలోని హిందువులకు మరచిపోలేని జ్ఞాపకం. అయోధ్యలో దశాబ్దాల పోరాటం తర్వాత బాల రామాలయ నిర్మాణం అత్యంత ఘనంగా జరిగింది. శ్రీ రామ చంద్రుడి జన్మభూమి అయిన అయోధ్యలో కొలువుదీరిన రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.

బాలరామయ్యకు ధనుస్సు కానుక
అయోధ్య రామాలయానికి పెద్ద సంఖ్యలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా అదే స్థాయిలో శ్రీరామ చంద్రమూర్తికి కూడా కానుకలు వస్తున్నాయి.ఇక తాజాగా అయోధ్య బాలరాముడికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఒక అపురూపమైన కానుక వచ్చింది. బాల రామయ్యకు ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అందమైన ధనుస్సు కానుకగా పంపారు. ఒక కిలో బంగారం, 13 కిలోల వెండితో తయారుచేసిన ధనుస్సును బాల రాముడికి పంపించారు.

Amazing gift from AP to Ayodhya sriram with 1 kg gold and 13 kg silver

ఒక కిలో బంగారం, 13 కిలోల వెండితో తయారు చేయించిన ధనుస్సు
అయోధ్య రాముడికి చల్లా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ధనుస్సు తయారు చేయించబడింది. మొత్తం ఏడు అడుగుల పొడవుతో ఉన్న ఈ ధనుస్సును ఒక కిలో బంగారం, 13 కిలోల వెండితో తయారు చేయించారు. ఈ ధనుస్సులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంత అద్భుతంగా ఏపీకి చెందిన భక్తుడు రూపొందించిన ఈ ధనుస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

ధనుస్సుకు ప్రత్యేక పూజలు
అయోధ్య రామాలయానికి ఈ ధనుస్సును తరలిస్తున్న క్రమంలో దీనికి ప్రత్యేక పూజలు చేశారు. భీమవరం మావుళ్ళమ్మ ఆలయానికి చేరుకున్న ధనుస్సుకు ప్రధాన అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. బాల రాముని సన్నిధికి చేరుతున్న ఈ ధనుస్సు ఎంతో స్పెషల్ అని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఈ ధనుస్సు త్వరలోనే అయోధ్య రామయ్య చెంతకు చేరుతుందని వారు చెప్తున్నారు.

అయోధ్య రాముడి కోసం ఎంత చేసినా తక్కువే
మనకు ఉన్న ఏడు మోక్ష మార్గాలలో అయోధ్య ఒకటని వారు చెప్తున్నారు. ఇక అయోధ్య రాముని కోసం ధనుస్సు తయారు చేయించటం ఎంతో సంతోషం కలిగించిందని చెప్తున్నారు. చల్లా శ్రీనివాస్. బాల రాముడి కోసం ఎంత చేసినా తక్కువే అని ఆయన పేర్కొన్నారు. అయోధ్యకు తరలి వెళ్ళిన ఏడడుగుల ధనుస్సును స్థానికులు ఆసక్తిగా తిలకించి, ప్రత్యేక పూజలు కూడా చేశారు. రామ నామ జపంతో అయోధ్యకు ధనుస్సును పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+