'దమ్ముంటే ఎన్నికలకు సిద్దమవండి.. ప్రజలే తేలుస్తారు వైసీపీ సత్తా'
హైదరాబాద్ : వైసీపీ ఉంటే టీడీపీకి పుట్టగతలుండవనే భయంతోనే చంద్రబాబు రాష్ట్రంలో వైసీపీ అవసరమా? అన్న కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి.. వైసీపీ మీద చంద్రబాబు చేస్తోన్న విమర్శలను తిప్పకొట్టారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు అంబటి. తమ పార్టీ రాష్ట్రంలో ఉండడం అవసరమో కాదో తేలాలంటే.. ఎన్నికలకు వెళితే ప్రజలే నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. ఇక ఓటుకు నోటుకు విషయంలో చంద్రబాబు తీరును తప్పుబడుతూ.. తాను ఇరుక్కున్న అన్ని కేసుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నారన్నారు. లక్షల కోట్లు వెనకేసుకోవాలన్న పిచ్చితోనే చంద్రబాబు వ్యవహారమంతా ఇలా తయారైందని ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నామని తమ పార్టీపై చేస్తోన్న విమర్శలపై స్పందిస్తూ.. తాము రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడం లేదని, అభివృద్ధి పేరుతో చేస్తోన్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications