'భయంతోనే... నీతి ఆయోగ్‌లో నిలదీస్తానని వెళ్లిన చంద్రబాబు, మోడీకి దండాలు పెట్టారు'
Recommended Video

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇక్కడ పదేపదే చెప్పుకున్న చంద్రబాబు, తీరా సమావేశానికి వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి దండాలు పెట్టారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబులో ఓవైపు భయం, మరోవైపు వినయం కనిపించాయని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. నాటకాలు ఆడటంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరన్నారు. ఆయన పేపర్ పులిలా ఉన్నారన్నారు.

అమరావతిలో పెద్దపెద్ద గాంఢ్రింపులు చేసే చంద్రబాబు, ఢిల్లీకి వెళ్లి నవ్వులతో పలకరింపులు అన్నారు. రాజనీతితో వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సరికాదన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా అవినీతి ఉందన్నారు. ఏపీ మొత్తాన్ని చంద్రబాబు అవినీతిమయం చేశాడని, అలాంటి వ్యక్తి నీతి ఆయోగ్‌లో ఏం మాట్లాడుతారన్నారు.
నీతి అయోగ్‌లో బాబు మాట్లాడిన సమయంపై రగడ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో 20 నిమిషాల పాటు మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని బీజేపీ నేతలు ఖండించారు. సమయం విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
చంద్రబాబు మాట్లాడింది 12 నిమిషాలు మాత్రమే అన్నారు. ప్రత్యేక హోదా బదులు కేంద్రం ప్యాకేజీ ఇస్తే స్వాగతించి, సన్మానాలు చేసింది చంద్రబాబు, టీడీపీయే అని జీవీఎల్ నర్సింహా రావు గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications