పవన్ అర్థం చేసుకున్నారు, వెయ్యి మంది బాబులొచ్చినా: తేల్చేసిన అంబటి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నంద్యాల ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటానని ప్రకటించడం శుభ పరిణామమని అంబటి రాంబాబు అన్నారు.

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ నంద్యాల ఉప ఎన్నికల్లో తటస్థంగా ఉంటానని ప్రకటించడం శుభ పరిణామమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు దుష్టపాలనను అర్థం చేసుకుని పవన్ దూరంగా ఉండాలని అనుకుని ఉంటారని చెప్పారు. బాబు నిజ స్వరూపాన్ని పవన్ అర్థం చేసుకున్నందుకు సంతోషమని అంబటి అన్నారు.

గురువారం అంబటి రాంబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తోందని ఆరోపించారు. నంద్యాలలో టీడీపీ గెలవకుంటే బతుకు లేదని భావిస్తున్నాయన్నారు. చంద్రబాబు అండ లేకుండా బతకలేమని పచ్చ మీడియా అనుకుంటోందని చెప్పారు.

ambati rambabu on Pawan kalyan's decision on Nandyal bypoll

గంగుల ప్రతాపరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరినట్లు కొన్ని ఛానళ్లు, పత్రికల ద్వారా జరిగిన ప్రచారం అవాసమని అన్నారు. ఆయన తమ పార్టీలో చేరనే లేదని, అలాంటిది గంగుల ప్రతాపరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటం అనేది సరికాదన్నారు.

చంద్రబాబుకు పరోక్షంగా మేలు చేసేందుకు లేనిది ఉన్నట్లు చెప్పేందుకు కొన్ని ఛానళ్లు, పత్రికలు యత్నిస్తున్నాయని చెప్పారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. వెయ్యిమంది చంద్రబాబులు వచ్చినా నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని అంబటి స్పష్టం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదా పొందకపోవడం వల్ల రాష్ట్రం నస్టపోయిందని, ఇప్పటికైనా హోదా కోసం చంద్రబాబు కృషి చేయాలని అన్నారు. వాస్తవాలు ప్రచురించే ధైర్యం పచ్చ పత్రికలు, ఛానళ్లకు లేదని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+