బ్రోను అందుకే టార్గెట్ చేస్తున్నా ! చంద్రబాబుకు అంబటి కౌంటర్ ! పవన్ పై మూవీ అప్ డేట్ ఇదే..
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య వార్ ముదురుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం బ్రోలో మంత్రి అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ పెట్టిన పాత్ర వివాదాస్పదమైంది. దీంతో ఆగ్రహంగా ఉన్న అంబటి.. ఢిల్లీకి వెళ్లి కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఈ సినిమా నిధులపై ఫిర్యాదు చేయబోతున్నారు. ఇవాళ ఢిల్లీ చేరుకున్న అంబటి.. వైసీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత జల్ శక్తి మంత్రి షెకావత్ తోనూ పోలవరంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాయలసీమ టూర్లో చంద్రబాబు స్ధాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. ఆంబోతు రాంబాబు అంటూ కించపరుస్తున్నారన్నారు. ఇరిగేషన్ గురించి చెప్పమంటే బ్రో సినిమా గురించి చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై తానూ మాట్లాడగలనన్నారు. చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సఫ్లై చేసి పైకి వచ్చాడని గతంలోనే చెప్పానన్నారు.

పోలవరం ప్రాజెక్టును 2018 కల్లా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని అసెంబ్లీలో ఎందుకు చెప్పారని చంద్రబాబును అంబటి ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇస్తామంటే ఎందుకు తీసుకున్నారని అడిగారు. పోలవరానికి వెన్నెమక లాంటి డయాఫ్రం వాల్ ను కాఫర్ డ్యాం పూర్తి కాకుండా ఎందుకు నిర్మించారని అడిగానన్నారు. వీటికి సమాధానం చెప్పకుండా ఆంబోతు రాంబాబు అంటున్నారని అంబటి ఆక్షేపించారు. రాయలసీమలో ఏ ఒక్కప్రాజెక్టు అయినా చంద్రబాబు కాలంలో శంఖుస్ధాపన, పూర్తి చేయడం చేశావా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు శంఖుస్ధాపన చేసి పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని అడిగారు.
బ్రోలో డైలాగులు, పాత్రలు పెట్టి మమ్మల్ని గోకుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నానని అంబటి అన్నారు. గతంలో పవన్ ఏ సినిమా అయినా తాను మాట్లాడానా అని ప్రశ్నించారు. పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చెప్పాలన్నారు.బ్రో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలన్నారు. బ్రో సినిమాకు పవన్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో నిర్మాత చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ రాముడు-భీముడు సినిమాలోలా పవన్ ను అంటే చంద్రబాబుకు గుచ్చుకుంటోందన్నారు.

చంద్రబాబు అబద్ధాలు లైవ్ డిటెక్టర్ కు కూడా దొరకవని, రాయలసీమకు అన్నీ నేనే చేశానంటే ఈ తరం వాళ్లు నమ్మేస్తున్నారని అంబటి ఆక్షేపించారు. ఢిల్లీలో షెకావత్, విజయసాయిరెడ్డిని కలిశానని, వైసీపీ ఎంపీలతో కలిసి చర్చించానన్నారు.బ్రో సినిమాపై కేంద్ర దర్యాప్తు సంస్ధలకు ఫిర్యాదుపై ప్రశ్నిస్తే.. కొన్ని బయటపెట్టలేనన్నారు. షెకావత్ ను పోలవరం రమ్మని అడిగితే సాధ్యమైనంత త్వరగా వస్తానన్నారని అంబటి తెలిపారు.
జనసేన పార్టీ నేతలు సంబరాల రాంబాబు అని సినిమా తీస్తున్నారని మీడియా ప్రశ్నించగా.. అలియాస్ సందులో శ్యాంబాబు అని తీసుకోమనండి అని అంబటి సూచించారు. ఈ సినిమాకు సాయం ఏవైనా కావాలంటే అడగమనండన్నారు. నేను తీసే సినిమా వైసీపీ తరఫున కాదు వ్యక్తిగతమే అన్నారు. పవన్ రోజుకు 2 కోట్లు తీసుకుంటారని గతంలో చెప్పాడని, బ్రో సినిమాకు ఎంత తీసుకున్నాడో చెప్పమంటే చెప్పట్లేదన్నారు. పవన్ సినిమాకు అఫీషియల్ గా తీసుకునేది కొంత, అనధికారింగా ఎంతో
పవన్ అఫీషియల్ పెళ్లిళ్లు మూడు, అనధికారికంగా ఎన్నో అని అంబటి ఎద్దేవా చేశారు. పవన్ పై తన మిత్రులతో కలిసి తాను తీయబోయే సినిమా టైటిల్ కోసం చర్చలు జరుపుతున్నట్లు అంబటి వెల్లడించారు.












Click it and Unblock the Notifications