వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు పవన్ కళ్యాన్ దత్త పుత్రుడు: జనసేనాని బరితెగించారు..పిచ్చిగా మాట్లాడుతున్నారు: అంబటి ఫైర్

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా..కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేకపోతున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశారని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జగన్‌ బాధ్యత అని అంబటి పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబుతో కుమ్మక్కై బరితెగించి సీఎంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని అంబటి ప్రశ్నించారు. వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్‌ కల్యాణ్‌కు ఈ సంగతి తెలియదా అంటూ ప్రశ్నించారు. పవన్‌ ఇప్పటికైనా చంద్రబాబు లాంటి వ్యక్తులను నమ్ముకొని రాజకీయాలు చేస్తే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి మద్దతుగా పవన్‌ జనసేన పార్టీనీ స్థాపించారని దుయ్యబట్టారు. చంద్రబాబు చీకట్లో చిదంబరం కాళ్లు పెట్టుకొని సీబీఐతో అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూశారన్నారు. అంతటితో ఆగకుండా అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా వైఎస్‌ జగన్‌ ఎవరికి భయపడలేదని గుర్తుచేశారు.

 Ambati Rambabu says Pawan Kalyan is adopted son of Chandrababu...

ప్రకాశం జిల్లాలో వలసల గురించి ప్రశ్నించే ముందు తన పార్టీలో జరుగుతున్న వలసలను ఆపుకోవాలని వ్యాఖ్యలు చేశారు. రెండోచోట్ల పవన్‌ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఆయన ఓడిపోయిన చోట ఇప్పటివరకూ మొహం చూపించలేదన్నారు. ప్రశ్నించారు. చంద్రబాబుతో లాలూచీ రాజకీయాలు చేసిన పవన్‌... కుప్పం, మంగళగిరిలో చంద్రబాబు, లోకేశ్‌పై ఎందుకు పోటీ పెట్టలేదని సూటిగా ప్రశ్నించారు. చెప్పుడు మాటలు వినకుండా సొంతంగా పార్టీ నడిపిస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం నాలుగు సీట్లయినా సంపాదించుకోగలుగుతారని సూచించారు. చంద్రబాబు డీఎన్‌ఏ, పవన్‌ డీఎన్‌ఏ ఒకటి కాబట్టే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. ఎన్నికల్లో రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌కు వైఎస్‌ జగన్‌ నైతికత గురించి మాట్లాడే హక్కుందా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

English summary
YCP senior leader Ambati Rambabu fire on Janasena chief pawan Kalyan. Rambabu says pawan is adopter son Chandra Babu.He suggested Pawan to dont believe chandra Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X