అఖిల ప్రియపై దాడి: అసలు ఏం జరిగిందంటే...! 'జగన్‌కు ఎదురు ఇష్టం లేకే'
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన తమ పార్టీ కార్యకర్తలు ఎలాంటి దాడికి పాల్పడలేదని వైసిపి నేత అంబటి రాంబాబు గురువారం స్పష్టం చేశారు. అన్నారు. అదంతా కల్పిత కథనమని చెప్పారు.
విజయవాడ : ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పైన తమ పార్టీ కార్యకర్తలు ఎలాంటి దాడికి పాల్పడలేదని వైసిపి నేత అంబటి రాంబాబు గురువారం స్పష్టం చేశారు. అన్నారు. అదంతా కల్పిత కథనమని చెప్పారు.
అఖిలప్రియ కారు పైన దాడి జరిగిందని, కారు అద్దాలు పగిలాయని ఓ వర్గం మీడియా చెబుతోందని, తనకు ఆ మీడియాపై గౌరవం ఉందని, కానీ ఇలాంటి కల్పిత కథను కొన్ని ఛానల్సులో వేస్తున్నారని మండిపడ్డారు.
అఖిల ప్రియ పైన దౌర్జన్యం చేసే అంత ధైర్యం తనకు ఉందా అన్నారు. ఇది అన్యాయమైన, దుర్మార్గమైన ప్రచారమన్నారు. కావాలని చేస్తున్న ప్రచారం అన్నారు.

అఖిల ప్రియ అటు వస్తున్నప్పుడు తాము అక్కడే ఉన్నామని, అలా దాడి ఏమీ జరగలేదన్నారు. అఖిల ప్రియ కంటే ముందు జూపూడి ప్రభాకర రావు చేతులు ఊపుకుంటూ వెళ్లారని, మేం కూడా ఊపామని, కావాలంటే అడగాలని అంబటి రాంబాబు అన్నారు. అఖిల ప్రియ వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ మంది రావడం వల్ల ఆమె వెనక్కి తిరిగి వెళ్లారన్నారు.
జగన్ రాకతో పెద్దగా రద్దీగా ఉండటం వల్లే ఆమె సచివాలయంలోకి వెళ్లలేక, తిరిగి వెళ్లిపోయారన్నారు. అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదన్నారు. కల్పిత కథ వినిపిస్తున్నారన్నారు. కల్పిత కథ ద్వారా జగన్ టూర్ ప్రాముఖ్యతని కించపరచారని, లేదంటే తగ్గించాలని చూస్తున్నారన్నారు.
అఖిల ప్రియ ఫిర్యాదు చేయమన్నారు
జగన్‌కు వచ్చిన స్పందనను తగ్గించేందుకు ముఖం మీద గుడ్డ కాల్చి వేస్తున్నారన్నారు. ఏదో టీవీలో అడిగితే.. తాను రిపోర్టు ఇవ్వలేదని అఖిల ప్రియ చెప్పారని, ఇప్పుడు అన్ని ఛానల్సులలో వస్తున్నాయి కాబట్టి రిపోర్ట్ ఇవ్వవలసి వస్తుందేమో అన్నారు. లేదంటే చంద్రబాబు ఒప్పుకోరని ఇష్యూ చేస్తారేమో అన్నారు.
దయచేసి అర్థం చేసుకోవాలని, ఇది అసలు ఇష్యూనే కాదని, ఎలాంటి సంఘటన జరగలేదన్నారు. ఎవరికీ అవమానం జరగలేదని, అర్థం చేసుకోవాలన్నారు.
జగన్‌కు ఎదురుగా రావడం ఇష్టం లేకే అఖిల ప్రియ..
జూపూడి ప్రభాకర రావు ముందుగా వచ్చారన్నారు. ఆయనను ఏమీ అననప్పుడు అఖిల ప్రియను ఎందుకు అంటారని ప్రశ్నించారు. ఇది కల్పిత కథ అన్నారు.
జూపూడి వెళ్లిపోయిన పది నిమిషాలకు.. అఖిల ప్రియ వచ్చారని, అప్పటికి జగన్ మరీ దగ్గరకు వచ్చారని అంబటి చెప్పారు. భారీగా వచ్చిన జనాన్ని చూసి, జగన్‌కు ఎదురుగా రావడం ఇష్టం లేక ఆమె వెనక్కి తిరిగి వెళ్తుందని భావించామన్నారు. ఇదీ జరిగింది అన్నారు. కానీ బైకులతో వెంటబడ్డారని చెప్పడం సరికాదన్నారు.
అసలేం జరిగిందంటే..
అఖిల ప్రియ పైన దాడి జరగలేదని వైసిపి, సాక్షి మీడియా చెబుతోంది. అసలు ఏం జరిగిందో వారి వాదన వినిపించారు. అఖిల ప్రియ వెలగపూడి సచివాలయం వెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే జగన్ కాన్వాయ్, దానికి తోడు పెద్ద ఎత్తున రైతులు, అభిమానులు వచ్చారని, ఈ రద్దీ వల్ల ఆమె వెలగపూడి వెళ్లలేక తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. దీనిని దాడిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications