వైసీపీ శ్రేణులకు మంత్రి అంబటి అలర్ట్..!!
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. జగన్ పైన విజయవాడ దాడితో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది.ఈ దాడి కేంద్రంగా పార్టీలు ప్రత్యర్దులను టార్గెట్ చేస్తున్నాయి. జగన్ తిరిగి బస్సు యాత్ర ప్రారంభించారు. జగన్ పైన దాడిని డ్రామాగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ మాత్రం తాను ఈ దాడులను పట్టించుకోనని...ముందుకే వెళ్తానని స్పష్టం చేసారు. ఈ సమయంలోనే మంత్రి అంబటి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు.
అంబటి వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని అందరికీ తెలుసన్నారు.. అందుకే ఇలా దాడికి ప్లాన్ చేశారని మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదని చెప్పారు. సంక్షేమ పథకాలే సీఎం వైయస్ జగన్‌ను గెలిపిస్తాయిని ధీమా వ్యక్తం చేసారు ముఖ్యమంత్రి జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదని వ్యాఖ్యానించారు. అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయన్నారు. ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం వైయస్ జగన్‌ను ఓడించలేరని అంబటి చెప్పుకొచ్చారు.

అందుకే జనం వస్తున్నారు
సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారని గుర్తు చేసారు. కానీ, చంద్రబాబు, పవన్‌లకు మాత్రం వెటకారంగా ఉందన్నారు. నాదెండ్ల మనోహార్ కోసం ప్రచారం చేసేందుకు పవన్ వచ్చారున్నారు. నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమేనని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ గాయంపై పవన్ కల్యాణ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ సినిమా యాక్టర్ కాబట్టి చూసేందుకు వస్తున్నారుని చెప్పారు. సీఎం వైయస్ జగన్ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారన్నారు.
పవన్ పైన వ్యాఖ్యలు
సీఎం వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని పేర్కన్నారు. పవన్ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారని గుర్తు చేసారు. మళ్లీ వైయస్ఆర్‌సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారని ఎద్దేవా చేసారు. గతంలో పవన్ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా... దీనికి పవన్ ఏం సమాధానం చెబుతారు అని నిలదీసారు. అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడరన్నారు. టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారుని హెచ్చరించిన అంబటి.. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేసారు.












Click it and Unblock the Notifications