పోలింగ్ నాడు ఫైట్ చేసిన కూటమి నాల్గవ పార్ట్‌న‌ర్: అంబటి రాంబాబు సెన్సేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూనే ప్రత్యర్థి వర్గాల పైన విరుచుకుపడుతున్నారు. ఏపీలో వైసీపీ సునామీ ఖాయమని, మళ్లీ వైసీపీ అధికారంలోకి రాబోతుందని, ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమేనని వైసీపీ మంత్రులు తేల్చి చెబుతున్నారు.

ఏపీలో పోలింగ్ పై వైసీపీ చెప్తుంది ఇదే
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో 151 అసెంబ్లీ స్థానాలను, 22 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. ఇక ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లరిన నేపథ్యంలో ఘర్షణలకు బాధ్యత ఎన్నికల సంఘం వహించాలని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఈసీ తీసుకున్న నిర్ణయాల వల్లే పోలీసులు ఫెయిలయ్యారని వారు అంటున్నారు.

Ambati rambabu shocking tweet The fourth partner in the TDP alliance fights on polling day

ఏపీలో ఘర్షణలను అడ్డుకోవటంలోపోలీసులు ఫెయిల్
ఏ మాత్రం అవగాహన లేని డీజీపీని, ఎస్పీలను ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నియమించటం వల్లనే ఏపీలో ఘర్షణలను అడ్డుకోవడంలో వారు ఫెయిల్ అయ్యారని పదేపదే వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఈ క్రమంలో తాజాగా వైసిపి మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు.

ఏపీలో కూటమితో నాల్గవ పార్ట్ నర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో నాలుగవ పార్ట్నర్ కూడా చేరారని, ఎన్నికల పోలింగ్ నాడు నాలుగవ పార్ట్నర్ రంగంలోకి దిగి పనిచేసినప్పటికీ జగనన్నదే విజయం అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టులో అంబటి రాంబాబు కూటమిలో 4 వ పార్టనర్ గా పోలింగ్ రోజున AP పోలీస్ చేరి ఫైట్ చేసినా జగన్ అన్నదే విజయం అంటూ పోలీసులను టార్గెట్ చేశారు.

పోలీసులను టార్గెట్ చేసిన అంబటి
పోలీసులు కూడా కూటమితో కుమ్మక్కై ఏపీ పోలింగ్ లో రాజకీయాలు చేశారని, కూటమికి అనుకూలమైన నిర్ణయాలను తీసుకున్నారని ఆయన పోలీసులపైన ఈ పోస్టు ద్వారా విమర్శలు గుప్పించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఈసీ పోలీస్ ఉన్నతాధికారులను మార్చి తీసుకున్న నిర్ణయాన్ని ఏపీలో జరిగిన గొడవల నేపథ్యంలో వైసిపి నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+