Ambati Rayudu: ఊహాగానాలకు తెరవేస్తూ వైసీపీకి రాజీనామాపై అంబటి రాయుడు క్లారిటీ
హైదరాబాద్: అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాయుడు రాజీనామాపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. టికెట్ ఇవ్వనందుకే రాజీనామా చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అంబటి రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో రాజీనామాపై మరోసారి వివరణ ఇచ్చారు.
'జనవరి 20 నుంచి దుబాయ్‌లో జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) ఎమిరేట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాను. వృత్తిపరమైన క్రికెట్ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది' అని అంబటి రాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉంది' అని రాయుడు ట్వీట్ చేశారు.

కాగా, రాజకీయాల కోసమే ఐపీఎల్‌కు దూరమయ్యాడు అంబటి రాయుడు. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నోసార్లు చెప్పిన రాయుడు.. గత సంవత్సర ప్రారంభంలో ఐపీఎల్ ప్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు. అనంతరం వైసీపీ తరపున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport.
— ATR (@RayuduAmbati) January 7, 2024
ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ 28న అధికారికంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైయస్సార్సీపీ కండువా కప్పి సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆయన వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, కేవలం పది రోజుల్లోనే వైసీపీని వీడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు కూడా ఈ విషయంపై స్పందిస్తూ వైసీపీని విమర్శించారు. ఈ క్రమంలోనై అంబటి రాయుడు తన రాజీనామాకు గల కారణాన్ని తెలియజేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications