వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాస నోటీసులు అందాయి: స్పీకర్, సోమవారానికి సభ వాయిదా

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:

కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై తనకు నోటీసులు అందాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ శుక్రవారం నాడు సభలో ప్రకటించారు.

శుక్రవారం నాడు పదే పదే లోక్ సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ చేపట్టారు. అయితే తీవ్ర గందరగోళం నెలకొంది.

విపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. దీంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన నోటీసు తనకు అందిందని చెప్పారు.

వైసీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి , టిడిపి సభ్యుడు తోట నరసింహం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అందిన విషయాన్ని ఆమె ప్రకటించారు. అయితే సభ ఆర్డర్‌లో లేకపోవడంతో ఈ విషయమై చర్చను చేపట్టలేకపోతున్నామని స్పీకర్ ప్రకటించారు. సభ ఆర్డర్‌లో లేనందున చర్చను చేపట్టలేకపోతున్నామని స్పీకర్ ప్రకటించారు.

అంతకుముందు విపక్ష ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారం నాడు వాయిదా పడ్డాయి విపక్ష సభ్యుల నిరసనలతో ప్రశ్నోత్తరాలను కొనసాగించాలని లోక్‌సభ స్పీకర్ ప్రయత్నించారు. కానీ, విపక్ష ఎంపీల ఆందోళనల మధ్య సభలో గందరగోళం నెలకొనడంతో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

పార్లమెంట్ సమావేశమైన తర్వాత ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభించాలని స్పీకర్ భావించారు. అయితే విపక్ష ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది.

Amid protests by Opposition MPs, Lok Sabha adjourned for the day; Rajya Sabha adjourned till 3 pm

విపక్షపార్టీలకు చెందిన ఎంపీలు తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకెళ్ళి ప్ల కార్డులు చేతబూని ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహజన్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

మరోవైపు రాజ్యసభలో కూడ ఇదే వాతావరణం నెలకొంది. రాజ్యసభలో కూడ విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ చైర్మెన్ , ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభను సజావుగా నడిపించేందుకు ప్రయత్నించారు.

కానీ, సభ్యులు మాత్రం శాంతించలేదు. తమ డిమాండ్లు నెరవేర్చాలని విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు కూడ ఆందోళనలు కొనసాగించారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు మధ్యాహ్నం మూడు గంటల వరకు రాజ్యసభను వాయిదా వేశారు.

English summary
After the obituary references were read out, Opposition parties' MPs created a ruckus over the no-confidence motion against the NDA government. Speaker Sumitra Mahajan adjourned the House till 12 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X