పవన్ కళ్యాణ్ సహా వారికి అమిత్ షా దిమ్మతిరిగే జవాబు, బిజెపి ఆనందం
ఏపీకి ప్రత్యేక హోదాపై నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం విజయవాడ కార్యకర్తల మహా సమ్మేళనంలో మరోసారి దిమ్మతిరిగే షాకిచ్చారు.
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదాపై నిలదీస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా బుధవారం విజయవాడ కార్యకర్తల మహా సమ్మేళనంలో మరోసారి దిమ్మతిరిగే షాకిచ్చారు.
చదవండి: సొంత పార్టీ నేతలకు అమిత్ షా షాకిచ్చారా?
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో లాభం లేదని, హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పవన్ కళ్యాణ్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే, ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి చురకలు అంటించారు.

జగన్ డిమాండ్ చేసినా..
ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హోదా కోసం వైసిపి, ఆ పార్టీ అధ్యక్షులు జగన్ కూడా మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే, మోడీతో భేటీ అనంతరం ఆయన హోదాపై పోరాటాన్ని వాయిదా వేసారనే చెప్పవచ్చు.

ఏపీకి ప్రయోజనాలపై..
కానీ ఇతర విపక్షాలు మాత్రం ప్రత్యేక హోదా కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. హోదాకు ఒక్క రూపాయి తగ్గకుండా తాము ప్యాకేజీని ఇస్తున్నామని తేల్చి చెప్పారు. అలాగే, ఏపీకి ఈ మూడేళ్లలో ఏం చేశామో గడగడా చదివి వినిపించారు.

కాంగ్రెస్‌కు కౌంటర్
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరో కౌంటర్ ఇచ్చారు. యూపీఏ హయాంలో ప్రవేశ పెట్టిన విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం స్పష్టంగా లేదని చెప్పారు. దీని వల్లే హోదాను ఇవ్వలేకపోతున్నట్లు అభిప్రాయపడ్డారు.

హోదాపై చిక్కుల్లో పడ్డ, ఇప్పుడు బిజెపిలో కొత్త ఉత్సాహం
మొత్తానికి ప్రత్యేక హోదా అంశంలో చాలా రోజులుగా బిజెపి చిక్కుల్లో పడింది. హోదా ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత బిజెపి యూటర్న్ తీసుకుంది. దీనిపై ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు కూడా తొలుత ఆగ్రహించినా.. హోదాపై ఓ నిర్ణయానికి వచ్చారని చెప్పవచ్చు.

హోదాతో దెబ్బతీయాలని చూస్తున్నా..
కానీ విపక్షాలు మాత్రం 2019లో ప్రత్యేక హోదా అంశంతోనే ముందుకు వెళ్లాలని, దీంతోనే బిజెపి - టిడిపిని వచ్చే ఎన్నికల్లో దెబ్బతీయాలని విపక్షాలు భావిస్తున్నాయి. కానీ అమిత్ షా హోదాకు మించి ప్యాకేజీ అని మరోసారి చెప్పారు. అంతేకాదు, హోదాపై ఏపీలోని వేడి తగ్గిందని అమిత్ షా పర్యటన ద్వారా తేలిపోయింది. దీంతో బిజెపిలోను కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications