రంగంలోకి అమిత్ షా: ఏపీ పరిణామాలపై ఆరా, ఆ ఫోన్ తర్వాతే రాజీనామా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఎన్డీఏ ప్రభుత్వం నుండి టిడిపి వైదొలిగింది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న ఆశోక్‌గజపతి రాజు, సుజనా చౌదరిలు గురువారం సాయంత్రం ప్రధానమంత్రి మోడీనిని కలిసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధాన మంత్రి ఫోన్ చేసినా మంత్రుల రాజీనామాల విషయంలో టిడిపి మాత్రం వెనక్కు తగ్గలేదు.ఈ పరిణామాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరా తీశారు. ఏపీకి చెందిన బిజెపి ఇంచార్జీలతో అమిత్ షా చర్చించారు.

  Slap to Ap Ministers By Amith Sha..కేంద్ర సమావేశం సంతృప్తికరంగా లేదు

  ఏపీకి అండగా ఉంటా:మోడీ, రాజీనామాలకు కారణమిదే: సుజనా, ఆశోక్

  కేంద్రం రాష్ట్రానికి నిధుల కేటాయింపు విషయంలో అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుండి మంత్రులను వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగనున్నట్టు ప్రకటించారు.

  గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగాలనే నిర్ణయం విషయమై బాబుతో మోడీ చర్చించారు. కానీ, బాబు మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. ఈ పరిణామాలపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టిడిపి నేతలను నిలువరించే ప్రయత్నాలు చేశారు.

  రంగంలోకి దిగిన అమిత్ షా

  రంగంలోకి దిగిన అమిత్ షా

  కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలగాలని టిడిపి నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు గురువారం సాయంత్రం టిడిపికి చెందిన ఇద్దరు మంత్రులు ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధానమంత్రి మోడీని కలిశారు. తమ రాజీనామా పత్రాలను మోడీకి అందించారు. అయితే ఈ విషయమై టిడిపి మంత్రులను కేబినెట్‌ నుండి వైదొలగకుండా ఉండేందుకు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

  బిజెపి నేతలతో మాట్లాడిన అమిత్ షా

  బిజెపి నేతలతో మాట్లాడిన అమిత్ షా

  ఏపీ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న బిజెపి నేతలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్లో చర్చించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం త్రిపురలో ఉన్నారు. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొంటున్న రాజకీయ పరిణామాలపై అమిత్ షా ఆరా తీశారు.

  స్వంత వాహనాల్లోనే మోడీ ఇంటికి

  స్వంత వాహనాల్లోనే మోడీ ఇంటికి

  రాజీనామాలు సమర్పించేందుకు సుజనా చౌదరి, ఆశోక్ గజపతి రాజులు తమ స్వంత వాహనాల్లోనే మోడీ ఇంటికి బయలు దేరారు. సుమారు అరగంటకు పైగా వారిద్దరూ మోడీతో చర్చించారు. ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలు, విభజన హమీలు అమలు చేయకపోతే చోటు చేసుకొనే పరిణామాలపై మంత్రులిద్దరూ మోడీకి వివరించినట్టు చెప్పారు. మోడీకి తమ రాజీనామా పత్రాలను సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

   ఫోన్ సంభాషణ పూర్తి కాగానే రాజీనామా

  ఫోన్ సంభాషణ పూర్తి కాగానే రాజీనామా


  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రధానమంత్రి మోడీ గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. కేంద్రం నుండి వైదొలగాలనే నిర్ణయంపై బాబుతో మోడీ చర్చించారు.ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని మోడీ బాబును కోరినట్టు సమాచారం.అయితే నిర్ణయంలో మార్పుండదని బాబు చెప్పారని సమాచారం. ఈ ఫోన్ సంభాషణ పూర్తైన వెంటనే ఆశోక్ గజపతిరాజు, సుజనా చౌదరిలు ప్రధాని వద్దకు వెళ్ళి రాజీనామా పత్రాలను సమర్పించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Bjp national president Amit shah discussed with party leaders about Tdp decision to quit from union cabinet.Amit shah phoned to Bjp leaders of Ap state on Thursday evening.Amit Shah talked to party leaders about the decision taken by the TDP to withdraw from the Center

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి