పోలింగ్‌కు ముందు టీడీపీని కలవరపెడుతున్న ఆ నాలుగు

TDP Janasena BJP alliance: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో నిర్వహించిన తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత షా చేసిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కూటమి తరఫున తొలిసారిగా ఎన్నికల ప్రచారానికి వచ్చారు అమిత్ షా. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో అమిత్ షా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి హెచ్చరికలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Amit Shah refrained from mentioning TDP Janasena s Super 6 manifesto even once in a public meeting

వీటన్నింటికీ భిన్నంగా సాగింది ఆయన ప్రసంగం. కూటమి ఒక్కసారి కూడా టీడీపీ- జేఎస్‌పీ ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 గురించి ప్రస్తావించడానికి ఇష్టపడలేదు. దీని గురించి అమిత్ షా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అందులో పొందుపరిచిన హామీలను అమలు చేస్తామని ఎక్కడే గానీ స్పష్టంగా తేల్చి చెప్పలేదు.

1. సూపర్ 6 మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉండటం ఇది మొదటిసారేమీ కాదు. గతంలో బీజేపీ తన వైఖరిని కుండబద్దలు కొట్టింది ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్.. దీన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదనే విషయం తెలిసిందే.

అందులో పొందుపరిచిన హామీలన్నీ కూడా అమలుకు నోచుకోనివనే కారణంతోనే అప్పట్లో ఆయన.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి దీన్ని ఆవిష్కరించడానికి ముందుకు రాలేదు. అవి శుష్క వాగ్దానాలు కావడం వల్లే అమిత్ షా సైతం వాటి గురించి ధర్మవరం బహిరంగ సభలో ప్రస్తావించలేదని అంటోన్నారు. పైగా చంద్రబాబు ప్రసంగించడానికి ముందే ఆయన సభ నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

2. కేంద్రం తరఫున ఏపీకి ఎలాంటి నిర్దుష్టమైన వాగ్దానాలను కూడా అమిత్ షా ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన విఫలం అయ్యారని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఊసే ఎత్త లేదు అమిత్ షా. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న బకాయిల గురించీ చెప్పలేదు. ఈ నిధుల విడుదలను కేంద్రం ఎప్పుడు వేగవంతం చేస్తుందనే దానిపైనా స్పష్టత ఇవ్వలేదు.

3. ఊహించినట్టే.. అమిత్ షా గానీ చంద్రబాబు గానీ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అంశాన్నీ ఈ సభ దృష్టికి తీసుకుని రాలేదు. నాలుగు శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తామంటూ వారిద్దరూ భరోసా ఇవ్వలేకపోయారు. దాని స్థానంలో రామమందిరం అంశాన్ని ప్రస్తావించడాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తు చేస్తోన్నారు.

4. వైఎస్ జగన్‌పై అమిత్ షా నేరుగా ఎలాంటి విమర్శలు చేయలేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. చాలా వరకు ఆయనను విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వలేదని, జాతీయ స్థాయి అంశాల విషయంలో మాత్రమే వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారని అంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటం, భవిష్యత్తులో తమ అవసరం రావొచ్చనే కారణంతోనే అమిత్ షా విమర్శలు చేయలేదని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+