ఐఏఎస్ శ్రీలక్ష్మీ పై పోలీస్ స్టేషన్‌లో అమరావతి రైతుల ఫిర్యాదు..!!
ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మీపై అమరావతి రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమరావతి రైతులతో నాడు ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూముల్లో భాగంగా వార్షిక కౌలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది చెల్లించాల్సిన కౌలు ఐదు నెలల దాటినప్పటికీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో కోర్టులో పిటిషన్ వేసారు. కోర్టు ఉత్తర్వులు మేరకు ఐఏఎస్ శ్రీలక్ష్మీ వ్యవహరించకపోవటంతో చర్యలు తీసుకోవాలని రైతులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.
మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా, చెల్లించలేదంటూ ఎపి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మిపై రాజధాని రైతులు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూములిచ్చిన రైతులకు మే నెల మొదటివారంలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదని, మొత్తం 22948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు కౌలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు. నిధుల విడుదలకు జిఒ జారీ అయినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదని ఆరోపిస్తూ ... సిఆర్‌పిసి 166 ప్రకారం ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

2014లో రాజధాని కోసం 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సేకరించారని.. రైతులతో సీఆర్డీఏ ఒప్పందం చేసుకు అమరావతి రైతులు తెలిపారు. ఒప్పందం ప్రకారం తమకు 10 సంవత్సరాలు వార్షిక కౌలు ప్రతి సంవత్సరం మేలో చెల్లించాలని.. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు పట్టాలు ఉన్నవారికి చెల్లించారని తెలిపారు. తొమ్మిదవ సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు నెలల దాటినప్పటికీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో కోర్టులో పిటిషన్ వేసినట్లు రైతులు తెలిపారు. వార్షిక కౌలు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంబంధిత అధికారిని ఐఏఎస్ శ్రీలక్ష్మీ చర్యలు చేపట్టకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని అన్నారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామని వాపోయారు.












Click it and Unblock the Notifications