జాక్ పాట్ కొట్టిన ఏపీ, తెలంగాణలోని రైల్వేస్టేషన్లు
కేంద్ర ప్రభుత్వం తాజాగా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ప్రకటించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన రైల్వేస్టేషన్లను దీర్ఘకాలిక ప్రాతిపదికన నిరంతరం అభివృద్ధి చేస్తుంటారు. స్టేషన్ యాక్సెస్, సర్క్యులేటింగ్ ఏరియాలు, వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్లు, పరిశుభ్రత, ఉచిత వై-ఫై లాంటి సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయి.
ప్రతి స్టేషన్ ఉన్న ప్రాంతం, అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి అభివృద్ధి జరుగుతుంది. ప్రధానమైన భవనాన్ని మెరుగుపరచడం, రెండు వైపులా స్టేషన్‌ను ఏకీకృతం చేయడం, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగుల సౌకర్యాలు, స్థిరమైన, పర్యావరణ అనుకూల పరిష్కారాలు, బ్యాలస్ట్ లెస్ ట్రాక్‌లు, అవసరాన్ని బట్టి రూఫ్ ప్లాజాలు ఏర్పాటు చేయడం చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 1309 స్టేషన్లను ఎంపిక చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచే 80 స్టేషన్లను ఎంపిక చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 64 స్టేషన్లు ఎంపికయ్యాయి.

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస రైల్వే స్టేషన్లు, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ధర్మవరం జంక్షన్, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ టౌన్, నాందేడ్, నెల్లూరు, రాయచూర్, రాజమండ్రి, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ, వరంగల్, అనకాపల్లి, అనంతపురం, ఔరంగాబాద్, భీమవరం టౌన్, కడప, జులూరు, కాజీపేట, ఏలూరు, గోదావరి, ఖమ్మం, ఒంగోలు, పర్భణి, సామర్లకోట, తెనాలి, ఆదోని, చీరాల, కర్నూలు టౌన్, మచిలీపట్నం, మంచిర్యాల్, పాలకొల్లు, రామగుండం, తాడేపల్లిగూడెం, తాండూరు, తణుకు, తుని, యాదగిరి, భీమవరం, డోన్, డోర్నకల్, గుడివాడ, గూడూరు, నిడదవోలు, పాకాల, పూర్ణ, రేణిగుంట, వికారాబాద్, అన్నవరం, బాసర్, భద్రాచలం రోడ్, బీదర్, మంత్రాలయం రోడ్, నాగర్‌సోల్, నల్గొండ, పర్లివైద్యనాథ్, శ్రీకాళహస్తి, నంద్యాల, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి.












Click it and Unblock the Notifications