Tomato: టమాటాలమ్మి సొమ్ముతో ఇంటికి.. మధ్యలోనే హత్య చేసిన దుండగులు..
టమాటా ధరలు భారీగా పెరుగతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా టమాటా ధరలు పరుగెడుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో కిలో టమాటా రూ. 250 పలికిన విషయం తెలిసిందే. ఒక్క టమాటా ధరే కాదు.. పచ్చి మిర్చి, క్యాప్సెకామ్, అల్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. హైదరాబాద్ లో కిలో టమాటా రూ. 120 నుంచి రూ.150 పలుకుతోంది. ఇక పచ్చి మిర్చి కిలో రూ. 130 నుంచి రూ.160 పలుకుతోంది. అల్లం కిలో రూ.250 పైనే ఉంది. కాప్సెకామ్ కిలో రూ. 120 లగా ఉంది.
టమాటా ధరలు భారీగా పెరగడంతో కొద్ది రోజుల క్రితం కర్ణాటలో టమాటా చేనులో దొంగలు పడ్డారు. రూ.2 లక్షల విలువైన టమాటాను రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. దీనిపై రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉత్తరప్రదేశ్ లో ఓ కూరగాయల వ్యాపారి టమాటా రక్షణ కోసం బౌన్సర్లను నియమించుకున్న విషయం తెలిసిందే. అంతుకు ముందు మధ్యప్రదేశ్ లో ఓ మొబైల్ షాప్ యజమాని స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాను బహుమతిగా ఇచ్చాడు.

తాజాగా ఓ టమాటా రైతు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఏపీలో జరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టమాటా రైతు దారుణను గుర్తు తెలియని దుండగులు హత్య చేశఆరు. బోడి మల్లెదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్ రెడ్డి కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం అతను మార్కెట్‌కు పెద్ద ఎత్తున టమాటాలను తీసుకు వచ్చి అమ్మాడు. టమాటాలకు విక్రయించగా అతనికి భారీగానే డబ్బులు వచ్చాయి.
అయితే అతను ఇంటికెళ్లేలోగా హత్యకు గురయ్యాడు. టమాటాలు అమ్మిన సొమ్మును దొచుకోవడానికి రాజశేఖర్ రెడ్డి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒకప్పుడు రోడ్డు పై వట్టిగా పారబోసిన టమాటాలు ఇప్పుడు భారీగా ధర పలకడంతో దారుణాలు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. టమాటాలను ఎత్తుకెళ్లడం ఏంది.. టమాటా అమ్మిన డబ్బు కోసం హత్య చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications