అనంతలో గొర్రెపిల్లను మింగి కదల్లేకపోయిన అనకొండ

గ్రామానికి చెందిన కేశవయ్య గొర్రెలను మేపేందుకు కనుమ కొండకు వెళ్లగా అక్కడ కొండ చిలువ గొర్రె పిల్లను మింగేసింది. కాపరుల ద్వారా సమాచారం తెలియడంతో కొండ చిలువను చూడడానికి గ్రామస్థులు భారీ సంఖ్యలో కనుమకొండకు చేరుకున్నారు.
ఈ కొండ చిలువ పదిహేను అడుగులు ఉంది. గొర్రెను మింగిన కొండ చిలువ ఎటు కదలలేకపోయింది. దీంతో గ్రామస్థులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పారు.
పెనుకొండ సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారికి విషయం తెలపడంతో ఆయన సోమందేపల్లి బీట్ ఆఫీసర్ రామకృష్ణ, సబ్ బీట్ ఆఫీసర్ వెంకటేశులులను సంఘటనా స్థలానికి పంపించారు. వారు ఆ కొండ చిలువను గోనె సంచిలో బంధించి అడవిలో వదిలి పెట్టారు.












Click it and Unblock the Notifications