జగన్‌పై నిందలొద్దు: ఆనం, టిపై ఆ ఒక్క మాటే: గంటా

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు లాలూచిపడటంతో జగన్‌కు బెయిల్ వచ్చిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. సిబిఐ, న్యాయస్థానాలు గతంలో బాగా పని చేశాయని బాబు చెప్పారని, ఇప్పుడు ఎలా తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. బెయిల్ పైన విడుదలయ్యే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అందులో భాగంగానే వైయస్ జగన్ బయటకు వచ్చారని చెప్పారు.
దివంగత టిడిపి నేత ఎర్రన్నాయుడు, మాజీ మంత్రి శంకర రావులు గతంలో వేసిన పిటిషన్ పైనే జగన్ పైన కేసు నమోదయిందని, ప్రస్తుతం కోర్టు తీర్పులతో జగన్ నిర్దోషిగా బయటపడితే ఆయన అనుభవించిన పదహారు నెలల శిక్షను మీరు అనుభవిస్తారా అని బాబును ప్రశ్నించారు.
ఆ ఒక్క మాటే!: గంటా
నోట్ తయారు చేశామని చెప్పడం తప్పితే ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణపై ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదని మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా అన్నారు. కేంద్రం ఇప్పటిదాకా విభజన ప్రక్రియకు ముందుకు వెళ్లలేదని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని మరో మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications