నాకు నచ్చినట్లు ఉంటా, శృంగారాల జోలికి పోను: ఆనం ఆసక్తికరం

Written By:
Subscribe to Oneindia Telugu

నెల్లూరు: నేను నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటానని, ఇష్టం వచ్చిన దుస్తులు వేసుకుంటానని, ఒకరు చెప్పినట్లుగా చేయనని నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుడు, టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. కొత్త గెటప్‌లలో తాను కనిపించడం వెనుక ఎటువంటి కారణం లేదన్నారు.

అది తన ప్రత్యేకత అని, తనకు ఎలా ఉండాలంటే అలా చేస్తానని చెప్పారు. తన బొడ్లో తాళాలు పెట్టుకుంటానని, కిర్రు చెప్పులు వేసుకుంటానన్నారు. జుత్తుకు ఇష్టమైన రంగు వేస్తానన్నారు. తాను శృంగారాల జోలికి పోనను, సింగారాలు మాత్రం చేస్తానని చెప్పారు.

Anam Vivekananda Reddy

తమ జిల్లాలో ఎంత మంది నాయకుల్లో శృంగార పురుషులు ఉన్నారో తనకైతే తెలియదని, తాను మాత్రం సింగార పురుషుడుని మాత్రమే అన్నారు. జనంతో ఉండటం, వారితో తన జీవితం కొనసాగించడమేనని తన కోరికలు అన్నారు. నెల్లూరులో ఉంటే తాను రోజూ సినిమాకు వెళ్తానన్నారు.

తాను ఒక్కడిని సినిమాకు వెళ్తానని చెప్పారు. తన మనవళ్లు కూడా తనను వివేకా అని పిలుస్తారని, కొడుకులు పిలిస్తే ఇంకా సంతోషంగా ఉంటుందన్నారు. నాకు నా వయస్సును గుర్తు పెట్టుకోవడం ఇష్టం ఉండదన్నారు. రాజకీయాల్లో కఠినత్వం, వ్యక్తిగతంగా సున్నితత్వం తన వైఖరి అన్నారు. తనకు స్ప్లిట్ మైండ్ సెట్ ఉందని చెప్పారు. ఆడవాళ్లను ఆకర్షించాల్సిన అవసరం తనకు లేదని, వాళ్లే తనను గెలిపించారన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam party leader Anam vivekananda Reddy interesting comments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి