బుద్ధుందా నీకు, రాక్షసుడి మాదిరి అడ్డుపడతావా?: జగన్‌పై ఆనం ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైసీపీ చేపట్టిన బంద్‌లు ప్రత్యేకహోదా కోసం కాదని, జగన్ తన హోదా పెంచుకోవడానికి ఆడిన డ్రామాగా టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ ఖాళీ అవుతున్న పార్టీని కాపాడుకోవాలని, ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోవాలని వైయస్ జగన్ విఫలయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బుద్ధుందా నీకు?... అంటూ జగన్‌పై ఆనం తీవ్ర స్ధాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు 67 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 33 శాతం వాటా మాత్రమే మిగిలిందని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే బాధ్యతతో చంద్రబాబు తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచేందుకు మహాయజ్ఞమే చేస్తున్నారన్నారు.

రామాయణ కాలంలో మునులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడ్డట్టు... రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు పాటుపడుతుంటే బంద్‌ల పేరుతో జగన్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

Anam vivekananda reddy fires on ys jagan over ap bandh

మంగళవారం వైసీపీ అధినేత వైయస్ జగన్ బంద్ చేయడం వల్ల రాష్ట్రానికి 450 కోట్ల (ముఖ్యమంత్రి చంద్రబాబు 4 కోట్లు ప్రకటించారు) రూపాయల నష్టం వాటిల్లిందని అన్నారు. బంద్‌లు చేయడం వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆయన తెలిపారు.

బంద్‌లు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన తెలిపారు. జగన్‌కు రాష్ట్ర అభివృద్ధిపై అంత ప్రేమ ఉంటే తన తండ్రి హయాంలో సంపాదించినదంతా ప్రజల కోసం త్యాగం చేయాలని సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tdp senior leader Anam vivekananda reddy fires on ys jagan over ap bandh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి