'జగన్ అహంకారం వ‌ల్లే వైసీపీకి కష్టాలు, ధ్యాసంతా డబ్బుపైనే'

అమరావతి: తన రాజకీయాల ప్రయోజనాల కోసం వైసీపీ అధినేత వైయస్ జగన్ తల్లిని సైతం ఉపయోగించుకుంటున్నారని టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ జగన్‌కి ప్రజా సంక్షేమంపై ఏ మాత్రం ధ్యాస ఉండబోదని, ఆయనకి కేవలం డ‌బ్బుపైనే దృష్టి ఉంటుంద‌ని విమ‌ర్శించారు.

జగన్ ఒక మానసికి రోగి అని ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. జగన్ నోటి నుంచి ఎల్ల‌ప్పుడూ నేను, నాది అనే మాట‌లు వస్తాయని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆయ‌నకి ఎన్న‌డూ మ‌న‌ది అనే భావ‌మే ఉండ‌ద‌ని, మ‌న‌ది అని ఏనాడు మాట్లాడ‌బోర‌ని ఆయన వ్యాఖ్యానించారు.

anam

జగన్‌కి ఉన్న అహంకారం వ‌ల్లే త‌న సొంత‌ పార్టీ నేత‌లు ఆయ‌న‌ను అసహ్యించుకొని టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నార‌ని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ ల‌క్ష కోట్ల రూపాయ‌లు సంపాదించార‌ని, ఏపీకి సీఎం అయి మ‌రిన్ని కోట్లు దోపిడీ చేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అన్నారు.

నియోజకవర్గ ఇన్‌ఛార్జిలను మార్చిన వైయస్ జగన్
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారి స్థానంలో కొత్త వారికి బాధ్యతలు అప్పగించారు. పార్టీ అధికార ప్రతినిధిగా విజయవాడ (సెంట్రల్)కు చెందిన పూనూరు గౌతం రెడ్డిని, అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాచన చెంచు గరటయ్యను, పార్టీ కార్యదర్శిగా అనంతపురం (అర్బన్) నేత బుర్రా సురేష్ గౌడ్‌లను నియమిస్తున్నట్టు వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది.

నరసాపురంలో జిల్లా కన్వీనర్ కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి చేరిన నేపథ్యంలో, ఆయన స్థానంలో ముదునూరి ప్రసాదరాజుకు ఆచంటతో పాటు నరసాపురం బాద్యతలను అదనంగా నియమించినట్టు వెల్లడించింది. ఎన్నారై డాక్టర్ల విభాగానికి మెల్‌బోర్న్‌కు చెందిన డాక్టర్ నలిపిరెడ్డి వాసుదేవ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినట్టు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+