నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘రాజకీయ కిక్కంటే ఇదే’.. టిట్ ఫర్ ట్యాట్!: నారాయణ వద్ద వేదనగా ఆనం

వీఆర్ కళాశాల విషయమై మంత్రి నారాయణను టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి కలిశారు. సమస్య పరిష్కారం కోసం సాయం కోరారు.

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అధికారంలో ఉన్నవాళ్లు.. ప్రతిపక్షంలోకి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. అధికార పక్షంలోకి.. అలా కాకపోతే.. అధికారంలో ఉన్న పార్టీలోకి ప్రతిపక్ష పార్టీ నేతలు. ఇలా ఏదైనా జరుగుతుంది. అయితే, అధికారంలో ఉన్నప్పుడు నేతలు ప్రతిపక్ష నాయకుల పట్ల వ్యవహరించిన తీరు.... మళ్లీ తమకే ఎదురైతే ఎలా ఉంటుందనే నెల్లూరు రాజకీయాలను గమనిస్తే తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం సోదరుల(ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి)ది ప్రత్యేక స్థానం ఉంది. ఆనం సోదరులు ఎప్పుడూ తమ వ్యవహారశైలి, వ్యాఖ్యలతో వార్తల్లో నిలస్తుంటారు. అలాంటి సోదరుల్లో ఒకరు వివేకానందరెడ్డి. నగర మేయర్‌గా.. పట్టణ ఎమ్మెల్యేగా జిల్లా ప్రజలేగాక, రాష్ట్ర ప్రజలకు కూడా సుపరిచితులే.

ఆనంకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు

ఆనంకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు

అంతేగాక, వీఆర్‌ కళాశాల కమిటీ కార్యదర్శి, కరస్పాండెంట్‌గా సుమారు రెండున్నర దశాబ్ధాలుగా వ్యవహరించారు. వీఆర్‌సీ(వెంకటగిరి రాజా కళాశాల) అంటే వివేకానందరెడ్డి అనే అర్థం వచ్చే విధంగా మార్చేశారు. అయితే, కళాశాల, ఆస్తులపై పట్టు పెంచుకున్న ఆనం కుటుంబానికి హైకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. కళాశాల కమిటీ ఎన్నికను రద్దు చేసింది. కాలేజీలో జరిగిన వ్యవహారం మొత్తాన్ని తప్పు పట్టింది. దీంతో ఆనం సోదరులు సందిగ్ధంలో పడ్డారు. ఇప్పటికే రాజకీయంగా కష్ట కాలం ఎదుర్కొంటున్న ఆనం సోదరులకు.. వీఆర్‌ కళాశాల పదవికీ కోర్టు ఆదేశాలు ఎసరు పెట్టడం మరింత షాక్‌కు గురిచేసింది. రాజకీయాల్లో ఆరితేరిన వివేకా.. ఇప్పుడు సాయం కోసం మరొకరి గడప తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మంత్రి నారాయణే దిక్కు!

మంత్రి నారాయణే దిక్కు!

ఈ సమస్య నుంచి గట్టెక్కించటానికి మంత్రి నారాయణ సాయమే కీలకమనుకున్నారు ఆనం. అనుకున్నదే తడవుగా గురువారం మంత్రి వద్దకు వెళ్లిపోయారు. అప్పటికే మండలి ఎన్నికలకు సంబంధించి కొందరు జిల్లా నేతలతో మంత్రి సమావేశంలో ఉన్నారు. కాగా, ఆనం కొంత వేదనగా , దీనంగా లోపలికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్న నాయకులు ఎవరికీ పరిస్థితి అర్థం కాలేదు. మంత్రితో రహస్యంగా మాట్లాడాలని కోరటంతో అక్కడ ఉన్న నేతలు కొంత దూరంగా వెళ్లారు.

ఓదార్చిన మంత్రి నారాయణ

ఓదార్చిన మంత్రి నారాయణ

వీఆర్‌ కళాశాలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వివేకా ప్రస్తావించారు. కళాశాల యాజమాన్యం వెంటనే తప్పిస్తే ఇబ్బంది పడాల్సి ఉంటుందని.. దీనిపై ఎలాగైనా సాయం చేయాలని కోరినట్లు తెలిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం కమిటీని తప్పించి.. ప్రత్యేక అధికారిని నియమిస్తే అనేక సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. దీంతో మంత్రి ఆనంను ఊరడిస్తూ రాజధానికి ఫోన్‌ చేసి తాత్కాలికంగా ఎలాంటి ఉత్తర్వులు వెలువడకుండా చూసినట్లు సమాచారం. దీంతో సమస్యకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

రాజకీయ కిక్కంటే ఇదే..

రాజకీయ కిక్కంటే ఇదే..

కాగా, ప్రస్తుత మంత్రి గతంలో నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఒక విషయమై ఎమ్మెల్యేగా ఉన్న వివేకాతో స్వల్ప వివాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే వివేకాను కలవటానికి వెళ్లిన నారాయణ లోపలికి పోవడానికి కొద్దిసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత నిబంధనలకు విరుద్ధంగా కట్టడం ఉందంటూ నారాయణ కళాశాలకు చెందిన భవనాన్ని నగరపాలక సంస్థ అధికారులు కూల్చేశారు. దీనివెనుక ఎమ్మెల్యే వివేకా సూచనలు ఉన్నాయని అప్పట్లో చర్చ జరిగింది.
కాగా, ఇదే విషయాన్ని గురువారం వివేకానందరెడ్డి వచ్చి వెళ్లిన తర్వాత నారాయణ సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. ‘‘రాజకీయ కిక్కు' అంటే ఇలాగే ఉంటుంది కాబోలు. గతంలో సాయం కోసం వివేకా దగ్గరకు వెళ్లాను. ప్రస్తుతం సాయం కోసం నా దగ్గరకు వచ్చారు' అంటూ మంత్రి నారాయణ.. సన్నిహితులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇది ఇలావుంటే వీఆర్ కళాశాల విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం.. మంత్రి నారాయణ కూడా విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందని పలువురు స్థానిక టీడీపీ నాయకులే చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

English summary
TDP leader Anam Vivekananda Reddy on Thursday met andhra Pradesh minister narayana for a college issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X