వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రివర్స్: వైసీపీలో చేరిన టిడిపి నేత రాజారెడ్డి

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌తో వైసీపీ రాజకీయంగా తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో టిడిపి నేత ఒకరు వైసీపీలో చేరారు.టిడిపిలో అసంతృప్తి నేతలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వైసీపీకి చెందిన నేతలు అధికార టిడిపిలో చేరుతున్నారు. ఈ పరిణామం వైసీపీ నాయకత్వానికి ఇబ్బంది కల్గిస్తోంది.అయితే ఇతర పార్టీల నుండి అధికార పార్టీల్లో పలువురు నేతలు చేరడంతో కొందరు అధికార పార్టీ నేతలు కూడ తీవ్ర అసంతృప్తికి గురౌతున్నారు.

Anantapur Tdp leader Raja Reddy joins in Ysrcp

ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రతిపక్ష పార్టీ వైసీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు ఎక్కువవుతుండటంతో.. అందుకు దీటుగా టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు వైసీపీ అధిష్టానం పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది.

తాజాగా అనంతపురం జిల్లా చౌళూరుకు చెందిన టీడీపీ నేత రాజారెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజారెడ్డికి వైసీపీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.చౌళూరులో వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.

English summary
Anantapur Tdp leader Raja Reddy joined in Ysrcp on Tuesday.Choulur Mandal leader Raja Reddy resigned to Tdp joined in Ysrcp in the presence of Ys Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X