వాట్సాప్ లో బూతుల పోస్ట్...భయంతో ఆత్మహత్యాయత్నం....

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అనంతపురం: సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ లకు హెచ్చరిక లాంటిది ఈ ఉదంతం. చట్టాల గురించి అవగాహన లేక ఓ యువకుడు వాట్సాప్ లో ఒక పొలిటికల్ పార్టీ గురించి అసభ్యపదజాలంతో కూడిన పోస్ట్ పెట్టాడు. ఆ తరువాత పోలీసులు పట్టుకుంటారేమోననే భయంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం సృష్టించింది.

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ గురించి ఆ పార్టీ వాట్సాప్ గ్రూప్ లో అసభ్యకరంగా తిడుతూ పోస్ట్ పెట్టాడు. అయితే ఆ తరువాత ఈ విషయం గురించి టిడిపి నేతలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎవరి ద్వారానో తెలిసింది. అంతే దీంతో తనను పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడిపోయిన సత్యనారాయణ స్థానిక పాఠశాల ఆవరణలో విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Ananthpur boy attempts suicide for whatsapp post

విషగుళికల ప్రభావంతో అపస్మారక స్థితిలో పాఠశాల ఆవరణలో పడి వున్న అతనని స్థానికులు గుర్తించారు. వెంటనే బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి అతనిని తరలించారు. అయితే సత్యనారాయణ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A young man from Ananthapur district on friday tried to commit suicide regarding his abuse post in tdp whatsapp group. The family members of that young man who attempted suicide says he try to took his own life after a whatsapp post.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి