ఇదేం ఆషామాషీ కాదు: బాబు, అండమాన్లో సత్తాతో ఉత్సాహం (పిక్చర్స్)
అమరావతి: అండమాన్ నికోబర్ దీవుల్లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఆషామాషీది కాదని టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు.
చంద్రబాబుతో అండమాన్ టిడిపి నేతలు భేటీ అయ్యారు. ఏపీలో అధికార పార్టీగా, తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ... ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా అండమాన్ నికోబార్లో ఇటీవల ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది.
దీంతో, అండమాన్ నికోబార్‌లో టీడీపీ సభ్యత్వాన్ని అక్కడి నేతలు భారీ ఎత్తున చేపట్టారు. వేలమంది సభ్యులుగా చేరారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
అండమాన్ నికోబార్‌కు చెందిన టీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబును కలుసుకున్నారు. త్వరలోనే లక్ష సభ్యత్వాలను పూర్తి చేస్తామని వారు అధినేతకు చెప్పారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... అండమాన్లో గెలుపు ఆషామాషీది కాదని చెప్పారు. అండమాన్ స్థానిక ఎన్నికల్లో గెలిచిన విజేతలను ఆయన అభినందించారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
టిడిపి జాతీయ పార్టీగా ఏర్పడగానే అండమాన్లోని మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందని, ఇది శుభసూచకమని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
అండమాన్ మున్సిపల్ ఎన్నికల్లో రెండు వార్డుల్లో గెలవడమే కాకుండా, పదహారు వార్డుల్లో రెండో స్థానంలో నిలబటడాన్ని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
అండమాన్ నికోబర్ టిడిపి అధ్యక్షుడు మాణిక్యాల రావు, పార్టీ ఇంఛార్జ్ వి మాధవ నాయుడు తదితరులు పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలన్నారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
వచ్చే ఎన్నికల నాటికి అండమాన్ నికోబర్ దీవుల్లో అన్ని ఎన్నికల్లో టిడిపి విజయం సాధించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
అమెరికా, ఇంగ్లాండ్, సింగపూర్, మారిషస్, ఆస్ట్రేలియాల్లో పార్టీకి శాఖలు ఉన్నాయని, అయితే జాతీయ పార్టీ హోదాలో టిడిపికి అండమాన్లో గెలుపు తొలి విజయం అన్నారు.

చంద్రబాబుతో అండమాన్ నికోబర్ నేతలు
అండమాన్ దీవుల్లో టిడిపిని బలపరిచేందుకు కృషి చేస్తున్నామని, 2010 ఎన్నికల్లో ఐదు శాతం ఓట్లు సాధించామని పార్టీ అండమాన్ అధ్యక్షులు మాణిక్యాల రావు చెప్పారు. అండమాన్ నికోబర్ నేతలు విజయవాడలోని చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో కలిశారు.












Click it and Unblock the Notifications