వైసీపీ చేతికి అడ్డంగా దొరికిన నారాయణ
Narayana: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో డేటా చౌర్యం మళ్లీ తెర మీదికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై భగ్గుమంటోంది. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
నెల్లూరు జిల్లాలో గల అన్ని నారాయణ విద్యాసంస్థలు డేటా చౌర్యం కేంద్రాలుగా మారాయంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని వారి ద్వారా కుటుంబ సభ్యులు, ఇతరుల వ్యక్తిగత సమాచారం మొత్తాన్నీ తస్కరించే పనిలో పడిందంటూ ఆగ్రహావేశాలను వ్యక్తి చేస్తోంది.

ఈ వ్యవహారం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ కనుసన్నల్లో సాగుతోందని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. తమకు ఉన్న నారాయణ కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, ప్రొఫెషనల్ కాలేజీల విద్యార్థుల చేతికి వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబీకుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తోందని వైసీపీ మండిపడింది.
ఈ మేరకు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. నారాయణ విద్యార్థులకు ఇచ్చిన ఓటర్ల వ్యక్తిగత వివరాల సేకరణ పత్రాన్ని దీనికి జత చేశారు. నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నారాయణ విద్యాసంస్థల్లో లక్షలాదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారిపై ఒత్తిడిని తీసుకొచ్చి.. వ్యక్తిగత డేటాను చోరీ చేస్తోన్నారని విమర్శించారు. బ్రాంచ్, టీచర్, స్టూడెంట్ పేరు, అడ్మిట్ కార్డ్ నంబర్, తల్లి, తండ్రి, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటినంబర్, అడ్రస్, వార్డు, పోలీంగ్ బూత్ నంబర్, ఫోన్ నంబర్, ఓటర్ ఐడీ కార్డులను సేకరిస్తోన్నారని చెప్పారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications