Daggubati Purandeswari: లోక్ సభ స్పీకర్ గా పురందేశ్వరి ? మోడీ లెక్కలేంటి ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం ఇప్పుడు కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కు కీలకంగా మారిపోయింది. ముఖ్యంగా 21 పార్లమెంట్ సీట్లను బీజేపీకి అందించడం ద్వారా వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఏర్పాటుకు కారణమైంది. దీంతో అందుకు తగినట్లుగానే కేంద్రంలో ఏపీకి ప్రాధాన్యం కల్పించేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. అయితే కేంద్రమంత్రి పదవుల విషయంలో ఏపీ బీజేపీకి చెందిన కీలక నేతల్ని కాదని జూనియర్ అయిన శ్రీనివాసవర్మకు అవకాశమిచ్చారు. దీంతో ఏపీ బీజేపీ ఛీప్ పురందేశ్వరితో పాటు సీఎం రమేశ్ కు ఏం దక్కబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.

కేంద్ర మంత్రివర్గంలో పురందేశ్వరికి చోటు దక్కుతుందని అంతా భావించినా అలా జరగలేదు. దీంతో ఈసారి పురందేశ్వరిని లోక్ సభ స్పీకర్ పదవికి ప్రధాని మోడీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పురందేశ్వరికి సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రమంత్రి వర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తి కూడా ఆమెకు కనిపించడం లేదంటున్నారు. బీజేపీ తరఫున ఈసారి గెలిచిన వారిలో పలువురు సమర్ధులు ఉన్నా దక్షిణాది నుంచి స్పీకర్ ను ఎంచుకోవాలని మోడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra bjp chief Daggubati purandeswari name for lok sabha speaker post

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లపై క్లారిటీ రానుంది. ఇప్పటికే టీడీపీ, జేడీయూ ఇద్దరూ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నారు. బీజేపీ గతంలోలా తమ పార్టీల్ని చీలుస్తుందనే భయంలో ఈ రెండు పార్టీలు స్పీకర్ పోస్టు అడుగుతున్నాయి. అయితే జేడీయూతో పోలిస్తే ఎక్కువ మంది ఎంపీలు కలిగిన టీడీపీకి నేరుగా స్పీకర్ ఇవ్వడం కంటే చంద్రబాబుకు వదిన అయిన పురందేశ్వరికి అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ స్పీకర్ ఉంటారనే భావనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్ నేపథ్యం లేకపోవడం మైనస్ అయినా ఈసారి సమీకరణాల దృష్ట్యా పురందేశ్వరికి దక్కొచ్చని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+