పెద్దిరెడ్డి అడ్డాలో పవన్ షాక్..! ఎర్రచందనం స్మగ్లింగ్ లో రెండు వికెట్లు..!
ఏపీలో ఎర్రచందనం (red sandal) అక్రమ రవాణా విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నఅధికారులపై అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) కన్నెర్ర చేశారు. గతంలో చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోకి వెళ్లి ఎర్ర చందనం అక్రమ రవాణా, అటవీ అధికారుల పనితీరుపై క్షేత్రస్దాయి సమీక్ష చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు నేరుగా చర్యలకు దిగారు. ఎర్రచందనం అక్రమ రవాణాతో సంబంధం ఉన్న ఉద్యోగులపై వేటు వేశారు.
చిత్తూరు జిల్లా పీలేరు రేంజ్ అటవీ శాఖలో ఇద్దరు ఉద్యోగుల్ని తొలగిస్తూ అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇద్దరు ఉద్యోగులను శాశ్వతంగా తొలగిస్తూ అధికారుల ఉత్తర్వులు ఇచ్చారు. 2021లో ఎర్ర చందనం స్మగ్లర్లకు సహకరించిన వీరు.. ఆధారాలతో సహా పట్టుబడ్డారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో స్మగ్లింగ్ కేసుపై ప్రత్యేక బృందం విచారణ జరిపింది. ఇందులో ఆధారాలు సరైనవే అని నిర్ధారణ కావడంతో ఉద్యోగులపై వేటు పడింది.

శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోవడంపై అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గతంలోనే సీరియస్ గా ఫోకస్ పెట్టారు. అందుకే క్షేత్రస్దాయికి వెళ్లి మరీ వాస్తవాలపై అధ్యయనం చేశారు. అనంతరం ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించారు. చివరికి బాధ్యులైన ఉద్యోగులపై వేటుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి పట్టు ఉండే ఈ ప్రాంతంలో ఇద్దరు అటవీ శాఖ ఉద్యోగులపై పవన్ కళ్యాణ్ వేటు వేయడం చర్చనీయాంశంగా మారుతోంది.












Click it and Unblock the Notifications