వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ స్కూల్స్ రీఓపెన్ సెప్టెంబర్ నుంచే: సీఎం జగన్ కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ.. కరోనా నిబంధనలకు లోబడి సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మెరుగైన విద్య తోపాటు విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం(జగనన్న గోరుముద్ద)పై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.

Recommended Video

Schools Reopen From September 5th in Andhra Pradesh

ఈ సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బంధీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక జాయింట్ డైరెక్టర్ పోస్టు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

పాఠశాలలు ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు
మూడో విడత డ్రైరేషన్ పంపిణీ కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఆన్‌లైన్‌లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నామని తెలిపారు.

 Andhra government plans to reopen schools from September 5th

అంతేగాక, ప్రతిఏటా అకాడమిక్ ఆడిటింగ్ నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ప్రీ ప్రమైరీ ఎడ్యుకేషన్ విధి విధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

కడపలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రిసోర్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు.

English summary
The Andhra Pradesh government has decided to restart schools from September 5, however, the final decision will be taken based on the situation when the date approaches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X