వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీకంటే బలవంతులే: పవన్ కళ్యాణ్ వార్నింగ్‌పై రాధాకృష్ణ, చిరంజీవిపై ఇలా

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్పందించారు. తనను కాపు కులానికి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ విషయానికి వస్తే ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీస్తానని పవన్ ఇటీవల తన ఏపీ పర్యటనలో వ్యాఖ్యానించారు.

చదవండి: మోడీకి ఎదురెళ్తా, విలీనం చేయకుంటే దెబ్బతీస్తున్నారు: అమిత్ షాపై పవన్ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Pawan Kalyan Tour : Pawan Kalyan About His Clash With Paritala Ravi

దీనిపై రాధాకృష్ణ ఒకింత ఘాటుగా స్పందించారు. తనను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించినా వృథానే అని, పవన్ కంటే బలవంతులే తనను తొక్కేయాలని చూశారని, వాటన్నింటిని తట్టుకొని నిలబడ్డానని ఆయన చెప్పారు. ఎవరెవరి సంస్థల్లో ఎంతమంది ఉన్నారో లెక్క తీస్తానని చెప్పడం ద్వారా పవన్ పరోక్షంగా తనకు వార్నింగ్ ఇచ్చారని భావిస్తున్నట్లు తెలిపారు.

చదవండి:అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

పవన్ కళ్యాణ్ వస్తే నేనే స్వాగతిస్తా

పవన్ కళ్యాణ్ వస్తే నేనే స్వాగతిస్తా

చలోరే చలోరో చల్ ప్రోగ్రామ్ ఆఖరి దశ పూర్తయింది కనుక పవన్ కల్యాణ్ తమ కార్యాలయాలకు వెళ్లి కులాలవారీగా లెక్కలు తీసుకోవచ్చునని, ఆయన వస్తానంటే నేనే గుమ్మం ముందు నిలబడి స్వాగతిస్తానని, ఎవరి కులం ఎమిటో తెలుసుకొని ఉద్యోగాలు ఇవ్వడం తమ సంస్థకు తెలియదన్నారు. ప్రాంతాలు, కులాలకు అతీతంగా వ్యవహరిస్తామన్నారు.

బాబు-పవన్ మధ్య సంబంధాల వల్లే సమస్యల పరిష్కారం

బాబు-పవన్ మధ్య సంబంధాల వల్లే సమస్యల పరిష్కారం

పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుకు మధ్య సంబంధాలు తెగిపోలేదు కాబట్టి ఆయన అడుగుతున్న వాటిపై టీడీపీ సమాధానం చెబుతోందని ఓ పాయింట్ లాగారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఉంటుందోనని కూడా వ్యాఖ్యానించారు. పవన్ ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి స్పందన వస్తోందని సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు క్యూ కడుతున్నారని, ప్రభుత్వం స్పందన లేకుంటే మాత్రం క్యూ కడుతున్న వారు కూడా రాకపోవచ్చునని అభిప్రాయపడ్డారు.

పవన్‌కు ఇంకా ఆ లక్షణం అలవడలేదు

పవన్‌కు ఇంకా ఆ లక్షణం అలవడలేదు

జనసేన.. టీడీపీకి పోటీగా మారినప్పుడు అధికార పార్టీ వైఖరి మారుతుందని, పవన్‌లో మాత్రం రాజకీయాలు స్వచ్ఛంగా ఉండాలనే వైఖరి కనిపిస్తోందని రాధాకృష్ణ కితాబిచ్చారు. సమాజంలో మార్పు కోరుకుంటున్న పవన్.. ఆ మార్పు ఎలా ఉండాలనే విషయమై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకుడు ఆచితూచి మాట్లాడాలని, పవన్‌కు ఇంకా ఆ లక్షణం అలవడలేదన్నారు.

తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్ పెట్టుకున్నారని

తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్ పెట్టుకున్నారని

అనుభవం లేనివారు సీఎం పదవికి అనర్హులు అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ తన భవిష్యత్తుకు తానే ఫుల్‌స్టాప్ పెట్టుకున్నారని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. పవన్ ఆచితూచి మాట్లాడకుండా ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు.

చిరంజీవి అతిమంచితనమే చేతకానితనం అంటూ!

చిరంజీవి అతిమంచితనమే చేతకానితనం అంటూ!

చిరంజీవిని మోసం చేసిన వారిని చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెబుతానని పవన్ చెప్పడం సరికాదని రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. మనలను అవతలి వారు మోసం చేశారంటే అది వారి గొప్పతనం కంటే మన చేతకానితనం అవుతుందని, అతి మంచితనం, దురాశ ఈ రెండింటి కారణంగానే మోసపోతామని, అతి మంచితనాన్నే చేతకానితనం అంటారని పేర్కొన్నారు. మోసపోవడం మన వైఫల్యమేనని పవన్‌కు కౌంటర్ ఇచ్చారు. పరోక్షంగా చిరంజీవి చేతగానితనం అని అభిప్రాయం వచ్చేలా మాట్లాడారు.

కులం ఆపాదించడంపై వివరణ

కులం ఆపాదించడంపై వివరణ

పవన్ కళ్యాణ్‌కు తాను కులం ఆపాదించలేదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆయన రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లినప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఎక్కువ హడావుడి చేసిందని, కానీ పవన్‌కు కులపిచ్చి లేదని తాను పేర్కొన్నానని, అందులో తాను పవన్‌కు కులం ఎక్కడ ఆపాదించానని ప్రశ్నించారు. ఆయన ఎందుకు అలా అర్థం చేసుకున్నారో తెలియడం లేదన్నారు.

వంగవీటి రంగాతో పోల్చినప్పుడు అభ్యంతరం చెప్పలేదే

వంగవీటి రంగాతో పోల్చినప్పుడు అభ్యంతరం చెప్పలేదే

పవన్ పర్యటన సందర్భంగా ఒకామే ఆయనను ఉద్దేశించి మన వంగవీటి రంగా వస్తున్నారని పోల్చిందని, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని రాధాకృష్ణను ప్రశ్నించారు. ఆయన అప్పుడు మౌనంగా ఉండిపోయారన్నారు. అంతేకాదు, పవన్‌ది విలక్షణ మనస్తత్వమని, అలాంటి వ్యక్తి ప్రస్తుత రాజకీయాలకు సరిపోరని, కానీ మార్పు కోసం చేసే ప్రయత్నంలో ఎంతమేరకు సఫలమవుతారో చూడాలన్నారు.

English summary
Andhra Jyothi Radhakrishna counter to Jana Sena chief Pawaj Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X