Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అదీ పవన్ కళ్యాణ్ స్థాయి, ఇదీ నేను: కత్తి మహేష్‌, దిమ్మతిరిగే షాకిచ్చిన అభిమాని

Recommended Video

    Mahesh Kathi Posted Cartoons Against Pawan Kalyan Goes Viral

    హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై కత్తి మహేష్ తన దాడిని ఆపడం లేదు. తన ఫేస్ బుక్ అకౌంటులో వరుసగా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తన స్థాయి పవన్ కళ్యాణ్ స్థాయి అంటూ మాట్లాడుతున్నారు. పవన్ కంటే తాను పది రెట్లు గొప్ప అని చెబుతున్నారు. ఎవడూ, ఒరే నాయనల్లారా అంటూ కొన్ని పోస్టులు పెట్టారు.

    అయితే, కత్తి మహేష్ ఫేస్‌బుక్‌కు పవన్ అభిమానులు దిమ్మతిరిగే షాకిస్తున్నారు. చిరంజీవి లేకుంటే పవన్ ఎక్కడ అని కత్తి మహేష్ పేర్కొన్నారు. దానికి పవన్ అభిమాని.. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ లేకపోతే మీరూ లేరండి అని గట్టి షాకిచ్చారు.

     పవన్ ఇంటర్ ఫెయిల్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్

    పవన్ ఇంటర్ ఫెయిల్, నేను పోస్ట్ గ్రాడ్యుయేట్

    'ఎవడు నా స్థాయి గురించి మాట్లాడేది? పవన్ కళ్యాణ్ ఇంటర్ ఫెయిల్. నేను పోస్ట్ గ్రాడ్యువేట్. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ లేదు. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇంక ఏ స్థాయి కావాలి? గుణమా! కులమా! మాట్లాడకుందామా!?' అని కత్తి మహేష్ ఓ పోస్టులో పెట్టారు.

     ఒరే నాయనల్లారా అంటూ

    ఒరే నాయనల్లారా అంటూ

    'ఒరే నాయనల్లారా... ఏదైనా ప్రాపగాండా స్ప్రెడ్ చెయ్యాలంటే కొంత హోమ్ వర్క్ చెయ్యండిరా. నేను ఎవరి దగ్గరైన డబ్బులు తీసుకుంటే ఆ చాట్ నేను స్క్రీన్ షాట్స్ తీసి ఎవరికైనా పంపిస్తానా? అని మరో పోస్ట్ పెట్టారు. డబ్బులు తీసుకొని పని చేస్తున్నాననే ఆరోపణలపై ఈ పోస్ట్ పెట్టారు.

     కత్తి మహేష్

    కత్తి మహేష్

    అదే పోస్టులో.. 'Grow-up guys! Come up with a better strategy than a screen shots with my name clearly written on it. ఆల్రెడీ పబ్లిక్ డొమెయిన్ లో ఉన్న నా ఫోన్ నెంబర్ తో లేదా కేవలం name change తో అలాంటివి ఎవరైనా క్రియేట్ చెయ్యొచ్చు.' అని కత్తి మహేష్ పేర్కొన్నారు.

    డబ్బులిచ్చినట్లు ప్రచారం, కలెక్ట్ చేసుకుంటా

    డబ్బులిచ్చినట్లు ప్రచారం, కలెక్ట్ చేసుకుంటా

    'ఎవరో నాకు డబ్బులు ఇచ్చి ఈ ప్రచారం చేయిస్తున్నారంట. నాకైతే ఎవరో తెలీదు. ఇంతవరకు డబ్బు కూడా ముట్టలేదు. మీకు తెలిస్తే చెప్పండి. వెళ్లి డబ్బులు కలెక్ట్ చేసుకొస్తాను. Please!!!'

    కొందరు పవన్ ఫ్యాన్స్ రియలైజ్ అవుతున్నారంటూ

    కొందరు పవన్ ఫ్యాన్స్ రియలైజ్ అవుతున్నారంటూ

    పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరు రియలైజ్ అవుతున్నారంటూ తనకు వచ్చిన కొన్ని పోస్టులను కత్తి మహేష్ పెట్టారు. తాము పవన్ అభిమానులమంటూ చెప్పుకొని పలువురు పెట్టిన కామెంట్లను పోస్ట్ చేశారు. చంద్రబాబు, జగన్‌ల కంటే పవన్ డేంజర్ అని ఒకరు, చంద్రబాబు, పరకాల ప్రభాకర్ వంటి సైడ్ యాక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయనపై నమ్మకం పోయిందని మరో వ్యక్తి పోస్ట్ పెట్టారు.

     పవన్ కళ్యాణ్‌పై కార్టూన్‌లు

    పవన్ కళ్యాణ్‌పై కార్టూన్‌లు

    తాజాగా, ఆదివారం పవన్ కళ్యాణ్‌కు చెందిన పలు కార్టూన్లు పోస్ట్ చేశారు కత్తి మహేష్. మొదటి దానిలో 2009లో చిరంజీవి మాట్లాడుతున్నట్లుగా, ఆ వెనుక పవన్ ఉన్నట్లుగా చూపించారు. రెండో దానిలో 2019లో అంటూ స్టోరీ పాతదే, స్క్రీన్ ప్లే కొద్దిగా మార్చుకోవాలని పేర్కొన్నారు. ఇక్కడ పవన్ మాట్లాడుతుంటే, వెనుక చిరంజీవి ఉన్నట్లుగా ఉంది.

    వరుస కార్టూన్లు

    వరుస కార్టూన్లు

    రెండో కార్టూన్‌లో మనోళ్లే సార్.. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారని, జనసేన టిక్కెట్లు 50 శాతం డిస్కౌంట్‌కు ఇస్తే చిరంజీవి పరువు కాపాడుతారట అని ఉంది. ఆ తర్వాత కార్టూన్లలో కొత్త రక్తం, చిరంజీవిని ఉపయోగించుకున్న స్వార్థ శక్తులను జనసేన ద్వారా చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెబుతానని తదితర వ్యాఖ్యలపై విమర్శలతో కూడిన కార్టూన్లను పోస్ట్ చేశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+