మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల లీక్.. ఆ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
మాజీ గర్ల్‌ఫ్రెండ్ తనతో సన్నిహితంగా గడిపిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో లీక్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాన్నాళ్ల పాటు వీరిద్దరి మధ్య కొనసాగిన బంధానికి ఇటీవల బ్రేక్ పడింది. కొన్ని కారణాల వల్ల గర్ల్‌ఫ్రెండ్ అతనికి బ్రేకప్ చెప్పింది. దీంతో తట్టుకోలేకపోయిన ఆ యువకుడు ఆమెపై కక్ష సాధించాలనుకున్నాడు. ఇదే క్రమంలో తనతో ఏకాంతంగా గడిపిన ఫోటోలను,ఆమె నగ్న చిత్రాలను ఫేస్‌బుక్‌లో లీక్ చేశాడు..

అసలేం జరిగింది..
చిత్తూరు జిల్లా రామకుప్పంకు చెందిన జగదీష్.. అదే జిల్లాకు చెందిన ఓ యువతితో కొన్నాళ్లు డేటింగ్ చేశాడు. ఆ సమయంలో ఇద్దరు చనువుగా మెలిగారు. ఇదే క్రమంలో ఇద్దరు సన్నిహితంగా గడిపిన క్షణాలను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు. అయితే ఇటీవల అతని అసలు క్యారెక్టర్ గురించి తెలుసుకుని యువతి బ్రేకప్ చెప్పింది. అప్పటినుంచి జగదీష్ ఆమెపై ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ఎలాగైనా ఆమెపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే క్రమంలో ఫేస్‌బుక్‌లో ఓ ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి.. తనతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు,నగ్న చిత్రాలను అందులో పోస్ట్ చేశాడు.

అంగీకరించిన యువకుడు..
తన మాజీ బాయ్‌ఫ్రెండ్ చేసిన పనికి షాక్ తిన్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు జగదీష్‌ను అరెస్ట్ చేసి విచారించగా నేరం అంగీకరించాడు. తనతో విడిపోయినందుకే ఫోటోలు లీక్ చేసినట్టు ఒప్పుకున్నాడు. జగదీష్‌పై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు తల్లిదండ్రులు,యువతీ యువతులకు ఓ విజ్ఞప్తి చేశారు. ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దన్నారు. వీడియో కాల్స్‌లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.

ఇటీవల తూర్పుగోదావరిలోనూ..
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. యువతులు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులకు ఆకర్షితులై ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ముఖ్యంగా తమ ప్రైవేట్ ఫోటోలను వారికి షేర్ చేయడం ద్వారా తర్వాత ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ ఫోటోలను అడ్డుపెట్టుకుని వారు యువతులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇటీవల ఇదే తరహా బ్లాక్‌మెయిలింగ్‌కి గురై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన నగ్న ఫోటోలతో ఓ యువకుడు బ్లాక్‌మెయిల్ చేస్తుండటంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.












Click it and Unblock the Notifications