ఏపీకి మరో గౌరవం-బిజినెస్ యాక్షన్ ప్లాన్ 2020 అచీవర్స్ లో టాప్-నాలుగోస్ధానంలో తెలంగాణ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కొన్నేళ్లుగా వరుసగా సత్తా చాటుతున్న ఏపీ మరోసారి బిజినెస్ ర్యాంకుల్లో సత్తా చాటుకుంది. బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో ఏపీ అగ్రస్ధానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇవాళ టాప్ అచివర్స్‌లో ఉన్న 7 రాష్ట్రాల వివరాలను ఢిల్లీలో ప్రకటించారు. ఇందులో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణకు నాలుగో స్ధానం దక్కింది.

బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2020
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపార రంగంలో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పాటు చేసిన కేంద్రం 2020లో కొన్ని లక్ష్యాలను పారికి నిర్దేశించింది. వాటిని అందుకున్న వారి వివరాలను ఇవాళ ప్రకటించింది. ఈ రెండేళ్లలో కేంద్రం నిర్దేశించిన వ్యాపార సంస్కరణల ప్లాన్ ను అందుకున్న టాప్ -7 రాష్ట్రాల జాబితాను అర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో మేటిగా నిలిచిన రాష్ట్రాలే ఇందులోనూ ఉన్నాయి.

టాప్ అచీవర్ గా ఏపీ
2020లో నిర్దేశించిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ ను అమలుచేస్తున్న రాష్టాల్లో టాప్ 7 స్ధానాల్లో ఉన్న రాష్ట్రాల పేర్లను కేంద్రం ఇవాళ ప్రకటించింది. ఇందులో ఏపీ టాప్ ప్లేస్ అందుకుంది. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకుల్లో టాప్ లో ఉన్న ఏపీ ఇప్పుడు వ్యాపార సంస్కరణల ప్లాన్ అమలుచేస్తున్న రాష్ట్రాల జాబితాలోనూ టాప్ లో నిలవడం విశేషం. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు తాజా ఫీట్ పై సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ జరిగింది. 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్ల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ నిర‍్ణయాలపై సానుకూలత వ్యక్తమైంది.

టాప్ -7 రాష్ట్రాలివే
బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ టాప్ అఛీవర్స్ జాబితాలో ఏపీ తర్వాత స్ధానాల్లో గుజరాత్, హర్యానా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. కేంద‍్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులను ఇచ్చింది. అచివర్స్ జాబితాలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప‍్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్ లిస్టులో అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. అటు ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిలిచాయి. వీటిలో ఢిల్లీ, పుదిచ్చేరి, త్రిపుర ప్రాంతాలు చోటు దక్కించుకున్నాయి.












Click it and Unblock the Notifications