వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: పార్టీల తెలంగాణ విమోచన దినోత్సవ సందడి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ముందుకు వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17వ తేదీకి ప్రాధాన్యం పెరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవంగా రాజకీయ పార్టీలు ఆ తేదీని గుర్తించి జాతీయ పతాకలను ఆవిష్కరించడం గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పెట్టుకున్నాయి. వామపక్షాలు మాత్రం తెలంగాణ రైతాంగ పోరాట విజయంగా పరిగణిస్తున్నాయి. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో విలీనమైంది.

అధికార కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు తమ తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించాయి. తెలంగాణలోని 9 జిల్లాల్లో కూడా రాజకీయ పార్టీలు ఇటువంటి కార్యక్రమాలనే నిర్వహించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకలను ఆవిష్కరించడానికి ప్రయత్నించిన బిజెపి కార్యకర్తలను కొన్ని చోట్ల పోలీసులు అరెస్టు చేశారు.

సెప్టెంబర్ 17వ తేదీని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని గత కొన్నేళ్లుగా బిజెపి డిమాండ్ చేస్తోంది. నల్లగొండ ఎస్పీ కార్యాలయంలో బిజెపి కార్యకర్తలు జాతీయ పతాకను ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లోనూ అటువంటి ప్రయత్నమే జరిగింది.

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శాసనసభ సమీపంలోని సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ విగ్రహం వద్ద జాతీయ పతాకను ఆవిష్కరించారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యాలయంలో నాయని నర్సింహా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

తెలంగాణ విమోచన దినోత్సవంలో కెకె

తెలంగాణ విమోచన దినోత్సవంలో కెకె

అంబేడ్కర్ కళాశాలలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు కె. కేశవరావు పాల్గొన్నారు.

ఎవి కాలేజీలో తెలంగాణ విమోచన దినోత్సవం..

ఎవి కాలేజీలో తెలంగాణ విమోచన దినోత్సవం..

హైదరాబాదులోని ఎవి కళాశాలలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కెటి రామారావు, జి. వివేక్ పాల్గొన్నారు. (AV1)

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాదులోని ఎవి కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చారు.

కమ్యూనిస్టులకు వార్షికోత్సవ సభ

కమ్యూనిస్టులకు వార్షికోత్సవ సభ

కమ్యూనిస్టులు సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణించరు. అందుకే దాన్ని తెలంగాణ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభగా వారు నిర్వహించారు.

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో హరీష్

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో హరీష్

హైదరాబాదులోని మింట్ కాంపౌండు ఆవరణలో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమ వేడుకల్లో తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు

జాతీయ పతాకను ఆవిష్కరించిన హరీష్

జాతీయ పతాకను ఆవిష్కరించిన హరీష్

మింట్ కాంపౌండు ఆవరణలో తెలంగాణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసిన తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు.

టిజెఎసి కార్యక్రమం

టిజెఎసి కార్యక్రమం

తెలంగాణ జెఎసి నేతలు తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో డిఎస్

తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో డిఎస్

పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఎగురేశారు. తెలంగాణ నేతలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

సర్దార్ విగ్రహం వద్ద బిజెపి

సర్దార్ విగ్రహం వద్ద బిజెపి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా బిజెపి నేతలు సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ విగ్రహం వద్ద జాతీయ పతాకను ఆవిష్కరించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడాన్ని వారు విమర్శించారు.

గన్‌పార్కు వద్ద విద్యార్థులు

గన్‌పార్కు వద్ద విద్యార్థులు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా తెలంగాణ విద్యార్థులు గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం జాతీయ పతాకను ఆవిష్కరించారు.

English summary
Political parties in Andhra Pradesh on Tuesday observed the Telangana "liberation day" by hoisting the national flag at party offices and calling for an army formation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X