పట్టువీడని చంద్రబాబు..! జగన్ అడ్డాలో బిగ్ ప్లాన్..! ముహుర్తం ఫిక్స్..!
ఏపీలో సీఎం చంద్రబాబుకూ, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూ మధ్య దశాబ్దానికి పైగా సాగుతున్న రాజకీయ పోరు తెలిసిందే. అయితే ఇందులో ఎవరి చేతులో అధికారం ఉంటే వారిది పైచేయి అవుతూనే ఉంది. ఇదే క్రమంలో గతంలో పులివెందులలో టీడీపీ పాగాకు చంద్రబాబు, కుప్పంలో వైసీపీ పాగా వేసేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఇందులో కొంతమేర సక్సెస్ కూడా కాగలిగారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.
గతంలో జగన్ నియోజకవర్గం పులివెందులకు నీళ్లిచ్చాకే తన సీటు కుప్పానికి నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు ప్రకటించారు. ఊహించినట్లుగానే కొన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి పులివెందులకు సాగునీరు ఇవ్వగలిగారు. అదే సమయంలో పల్లె పల్లెకూ 24 గంటలూ తాగునీరు అందించేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్‌కు శంఖుస్థాపన చేశారు. వెయ్యి కోట్లతో డీపీఆర్ కూడా రెడీ చేశారు. అంతలోనే 2019లో అధికారం మారడంతో వైసీపీ దాన్ని పక్కనబెట్టేసింది.

వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ పులివెందులలో రూ.480 కోట్లతో కేంద్ర,రాష్ట్ర, జలజీవన్ నిధులతో వాటర్‌గ్రిడ్ కు అడుగు వేశారు. దీంతో నియోజకవర్గంలోని లింగాల, తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని ప్రజలకు, విద్యాసంస్ధలకు నీళ్లు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికీ రోజుకు వంద లీటర్ల నీరు ఇవ్వాలనుకున్నారు. అయితే ఈ పనులు కూడా పూర్తికాకుండానే జగన్ చేతిలో నుంచి అధికారం మళ్లీ చంద్రబాబు చేతుల్లోకి వచ్చింది. దీంతో చంద్రబాబు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆ పనుల్ని కొనసాగిస్తున్నారు.

పులివెందులలో ఇప్పటికే వాటర్ గ్రిడ్ కోసం 1110 కిలోమీటర్ల పైపులైన్ వేయాల్సి ఉండగా ఇప్పటికే 950 కిలోమీటర్లు పూర్తి చేశారు. ఈ పనుల్ని డిసెంబర్ 20 కల్లా పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు డెడ్ లైన్ కూడా పెట్టారు. దీంతో వాటర్ గ్రిడ్ పనులు చకచకా సాగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే ఎట్టి పరిస్దితుల్లోనూ జనవరిలో జగన్ పులివెందులకు తాగునీరు అందించి రికార్డు సృష్టించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే విపక్ష నేత నియోజకవర్గాన్నీ నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చేస్తున్నట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications