అమరావతిలో అవినీతి తిమింగలం: రూ. 100కోట్ల ఆస్తులు, 3కిలోల గోల్డ్ సీజ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో అవినీతి తిమంగలం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏపీ ఎక్సైజ్ అదనపు కమిషనర్ కె లక్ష్మణభాస్కర్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖాధికారులు శనివారం ఏకకాలంలో 11ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.
విశాఖ, హైదరాబాద్, విజయవాడ, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో నిర్వహించిన దాడుల్లో మొత్తం రూ.2 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించినట్లు అనిశా సంయుక్త సంచాలకులు మోహన్‌రావుతెలిపారు. వీటి మార్కెట్‌విలువ రూ.100కోట్లు ఉండొచ్చని అంచనా. హైదరాబాద్‌లో నిర్వహించిన సోదాల్లో 3కిలోల బంగారం, రూ.2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. భారీగా అక్రమాస్తులు లభించడంతో లక్ష్మణబాస్కర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
బయటపడ్డ ఆస్తుల వివరాల్లోకి వెళితే.. ఫ్లాట్లు-2, ఇళ్ల స్థలాలు-9, వ్యవసాయ భూమి-4.5 ఎకరాలు, బంగారం 370 గ్రాములు, స్కార్పియో వాహనం, విదేశీ మద్యం సీసాలు-7. రూ.7 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు.

అంతేగాక, విశాఖపట్నం సీతమ్మధారలో 1720 చ.అడుగుల భూమి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలో 1524 చ.అడుగుల ఫ్లాట్లు. గాంభీరంలో 600 చ.గజాల స్థలం, ఎంవీపీ కాలనీలో 200 చ.గజాలు, కృష్ణా కళాశాల సమీపంలో 170 చ.గజాలు, పెందుర్తిలో 325 చ.గజాల స్థలం, ఇబ్రహీంపట్నం సమీపంలో 200 చ.గజాల విస్తీర్ణం ఉన్న రెండు స్థలాలు, కీసర మండలం దుమ్మాయిగూడెంలో 200చ.గజాల విస్తీర్ణం ఉన్న రెండు స్థలాలున్నాయి.
హయత్‌నగర్‌లో 200 చ.గజాలు ఉన్నాయి. కాగా, అతనికి సంబంధించిన అక్రమాస్తులు ఇంకా లభించే అవకాశం ఉండటంతో ఏసీబీ అధికారులు ఆదివారం కూడా సోదాలు కొనసాగించారు.












Click it and Unblock the Notifications